అయోధ్యలో ఆ శిలలను ఉలి తో చెక్కకూడదా.. అలా చేస్తే వినాశనం తప్పదా..

వందల సంవత్సరాల పోరాటాలు త్యాగాల తర్వాత ఎట్టకేలకు శ్రీరాముడు తన జన్మస్థానంలో ఆసీనుడయ్యే రోజు వచ్చేసింది.సరిగ్గా 11 నెలల తర్వాత రాముడు తన గర్భగుడిలో కూర్చొని భక్తులకు దర్శనం ఇస్తారు.

 Shouldn't Those Rocks Be Carved With Chisels In Ayodhya , Ayodhya, Janakpur In N-TeluguStop.com

ఈ కారణంగా రాముడి విగ్రహాన్ని తయారు చేయడానికి నేపాల్ లోని జనక్‌పూర్ నుంచి రెండు భారీ శిలలు పవిత్ర నగరమైన అయోధ్యకు చేరుకున్నాయి.మత విశ్వాసాలు, రామభక్తుల విశ్వాసం కారణంగా ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది.

వాస్తవానికి జనక్‌పూర్ లోని జానకి దేవాలయ మహంత్ నేపాల్ ఉప ప్రధానమంత్రి సమక్షంలో రెండు శాలిగ్రామాలను శిలా ట్రస్ట్ ఆఫీస్ బేరర్‌లకు అప్పగించారు.ఈ రెండు రాళ్ళను రెండు ట్రక్కులలో అయోధ్యకు తీసుకొని వచ్చారు.

అయితే రాళ్లపై మత విశ్వాసాలకు సంబంధించి కొత్త వివాదం మొదలైంది.

Telugu Ayodhya, Bhakti, Devotional, Janakpur Nepal, Lord Vishnu, Mahanth, Ram La

అయోధ్యకు చేరుకున్న శాలిగ్రామ శిలలు నేపాల్ లోని పవిత్ర నది గండకి ఒడ్డున ఉండేవి.అవి సుమారు 6 కోట్ల సంవత్సరాల పురాతనమైనవి అని ప్రజలు నమ్ముతున్నారు.అయోధ్యకు చేరుకున్న శిలలలో శ్రీ హరివిష్ణువు నివసిస్తున్నారని మత విశ్వాసులు ఉన్నాయి.

ఈ శిలలలో విష్ణుమూర్తి తో పాటు మాత లక్ష్మి కూడా నివసిస్తుందని నమ్ముతున్నారు.ఈ శాలిగ్రామ శిలలు పవిత్రమైనవి.

ఎందుకంటే అవి విష్ణుమూర్తి మత లక్ష్మీ స్వయం రూపాలుగా భావిస్తున్నారు.నేరుగా ప్రతిష్టించడం ద్వారా పూజలు ప్రారంభించాలని అంటున్నారు.

Telugu Ayodhya, Bhakti, Devotional, Janakpur Nepal, Lord Vishnu, Mahanth, Ram La

శ్రీరాముని జన్మస్థానం అయిన అయోధ్యకు నేపాల్ నుంచి ఈ రెండు శాలిగ్రామ శిలలను తీసుకువచ్చారు.శాలి గ్రామంలోని పెద్ద రాతి నుంచి శ్రీరాముడి విగ్రహాన్ని తయారు చేయించాలన్న చర్చ జరుగుతుంది.అందుకే భక్తులు ఆ రాయిని రామ్ లాలా రూపంలో భావించి పూజించడం మొదలుపెట్టారు.పీఠాధీశ్వర్ జగద్గురు పరమహంస ఆచార్య శాలిగ్రామ శిలా స్వయంగా నారాయణుడి రూపమని చెప్పారు.

అటువంటి పరిస్థితిలో దేవునిపై ఉలి,సుత్తితో దాడి చేయకూడదు అని చెబుతున్నారు.అదే జరిగితే దేశంలోనూ, ప్రపంచంలోనూ భయంకరమైన విపత్తు తప్పదని హెచ్చరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube