ఈ దేవాలయంలో హనుమంతుడిని.. బీడీలతో ఎందుకు బంధించారు తెలుసా..?

ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న హిందూ దేవాలయాలు( Hindu temples ) మన భారత దేశంలో ఎన్నో ఉన్నాయి.అలాగే ఎన్నో చరిత్రత్మక కట్టడాలు కూడా మన దేశంలో ఉన్నాయి.

 Do You Know Why Lord Hanuman Is Bound With Beedis In This Temple , Hindu Temples-TeluguStop.com

అలాంటి ఒక చరిత్రత్మక దేవాలయం ఒడిస్సాలో వెలిసిన పూరి జగన్నాథ దేవాలయం.అలాగే శ్రీరాముని భక్తుడు ఆంజనేయస్వామి దేవాలయం( Anjaneyaswamy Temple ) కూడా ఈ పుణ్యక్షేత్రంలో ఉంది.

ఈ హనుమాన్ దేవాలయాన్ని దారియా మహావీర క్షేత్రంగా పిలుస్తారు.అయితే ఈ దేవాలయంలో హనుమంతున్నీ సంకెళ్లతో బంధించారు.

అసలు హనుమంతుని ఎందుకు బంధించారు.అసలు ఈ దేవాలయంలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.పూరీక్షేత్రంలో జగన్నాథుడు వెలసిన తర్వాత ఆయన దర్శనం కోసం సముద్రుడు ఆ దేవాలయాన్ని సందర్శించాడు.అప్పుడు దేవాలయంలోకి ఊరంతా చేరి సముద్రుడి నుంచి రక్షించమని జగన్నాథుడిని వేడుకున్నారు.

ప్రజల బాధను చూసి జగన్నాథ స్వామి ప్రత్యక్షమయ్యాడు.ఆ క్షేత్రానికి రక్షకుడిగా ఉండే హనుమంతున్ని విచారించారు.

Telugu Lordhanuman, Hindu Temples, Jagannath, Lord Hanuman, Temple-Latest News -

అయితే హనుమంతుడు జగన్నాధుని( Jagannath ) అనుమతి లేకుండా అయోధ్య వెళ్లినట్టు తెలుసుకుంటాడు.అప్పుడు ఆగ్రహానికి గురైన జగన్నాథ స్వామి హనుమంతుని కాళ్లు చేతులను తాడుతో కట్టేశాడట.అంతేకాకుండా ఇక ముందు అక్కడ నుండి ఎక్కడికి వెళ్లకుండా ఈ క్షేత్రంలోకి సముద్రుడు రాకుండా కాపలాకాయాలని చెప్పాడట.అప్పటి నుంచి ఆ క్షేత్రంలో ఆంజనేయుడు సంకెళ్లతో దర్శనమిస్తాడని భక్తులు చెబుతున్నారు.

అప్పుడే ఆ స్వామివారికి దరియా మహావీర అని పేరు వచ్చింది.

Telugu Lordhanuman, Hindu Temples, Jagannath, Lord Hanuman, Temple-Latest News -

దరియా అంటే సముద్రం అని అర్థం వస్తుంది.అప్పటి నుంచి వాయు పుత్రుడు పూరి నగరాన్ని రక్షిస్తున్నాడని అక్కడి భక్తులు నమ్ముతారు.అలాగే ఈ అంజనీ పుత్రున్నీ బేడి హనుమంతుడు అని కూడా పిలుస్తారు.

హనుమంతుడు కావాలాగా ఉన్నప్పటి నుంచి నగరానికి సముద్రం ఎంత దూరం ఉన్నా, తుఫాన్ వచ్చిన ఆ నగరంలోకి సముద్రపు నీరు రాదని అక్కడి భక్తులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube