మన భారతదేశంలో ఎన్నో పురాతన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.ఈ పుణ్య క్షేత్రాలకు ప్రతి రోజు ఎంతో మంది భక్తులు తరలి వచ్చి పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.
అంతే కాకుండా మన దేశంలో ప్రతి నెల ఏదో పండుగను ప్రజలు జరుపుకుంటూ ఉంటారు.ముఖ్యంగా ఈ నెల లో శ్రీరామనవమి పండుగను ప్రజలందరూ దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాలలో రాముడి దేవాలయాలు వేడుకలకు వేగంగా ముస్తాబవుతున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం వైభవంగా ఈ వేడుకలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది.
ముఖ్యంగా భద్రాద్రి రామయ్య కోవెలలో ఏర్పాట్లు చాలా వేగంగా జరుగుతున్నాయి.
ఇంకా చెప్పాలంటే భద్రాచలం శ్రీ సీతా రామ చంద్రస్వామి దేవాలయంలో ఈ నెల 30వ తేదీన శ్రీరామనవమి, 31వ తేదీన పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.అయితే అనివార్య కారణాలతో ఈ వేడుకలలో ప్రత్యక్షంగా పాల్గొనలేని భక్తుల కోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాలయా ఈవో రమాదేవి గారు వెల్లడించారు.
గతంలో మాదిరే కళ్యాణోత్సవంలో పరోక్ష పద్ధతిలో భక్తుల గోత్రనామాలు పాటించానున్నట్లు ఈవో రమాదేవి వెల్లడించారు.కల్యాణోత్సవం,సామ్రాజ్య పట్టాభిషేకం వేడుకలకు హాజరవ్వలేని వారు ఇప్పటి నుంచే www.bhadrachalamonline.com ఈ వెబ్సైట్ ద్వారా గాని, రామాలయ కార్యాలయంలో గాని ఈ పరోక్ష పూజ టికెట్లను పొందే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.ముఖ్యంగా చెప్పాలంటే రూ.5 వేల టికెట్ల పై మూల వరుల శాలువా, కుంకుమ, ముత్యాల తలంబ్రాల ప్యాకెట్, మిస్రీ ప్రసాదం అందించనున్నారని ఈవో రమాదేవి గారు వెల్లడించారు.