అంగరంగ వైభవంగా జరిగిన గాంగ నీళ్ళ జాతర..!

సారంగాపూర్ మండలంలోని శ్రీ మహా ఆడేల్లి పోచమ్మ జాతర ( Sri Maha Audelli Pochamma Jatara )ఎంతో ఘనంగా వైభవంగా జరిగింది.శనివారం విశ్రాంతి తీసుకుని తిరిగి ఆదివారం ఉదయం గోదావరి జలాలతో అమ్మవారి ఆభరణాలను, నగలను అభిషేకించి తిరిగి దేవాలయానికి ప్రయాణం సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి తీరానికి కేవలం కాలినడకన మాత్రమే చేరుకున్నారు.

 Audelli Pochamma Temple Fair Held In Grandeur Devi Sharannavaratri , Audelli P-TeluguStop.com

అడివి ప్రాంతంలో గల ఈ క్షేత్రంలో వెలసిన అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారమై విరజల్లుతూ ఉంది.తిథి ముహూర్తాలతో సంబంధం లేకుండా దేవి శరన్నవరాత్రుల( Devi Sharannavaratri )లో వచ్చే శనివారం జాతర మొదలై ఆదివారం ముగిసిపోయింది.

Telugu Audellipochamma, Devotees, Ganga, Godavari, Godavari Sang, Sarangapur-Lat

అమ్మవారి ఆభరణాలను, నగలను పవిత్ర గోదావరిలో శుభ్రం చేసే ఈ జాతర కార్యక్రమం రెండు రోజులుగా ఎంతో వైభవంగా జరిగింది.ఈ నేపథ్యంలో శనివారం అడేల్లి పోచమ్మ దేవాలయం ( Audelli Pochamma Temple )నుంచి అమ్మవారి ఆభరణాలతో బయలుదేరి, ఆదివారం ఉదయం న్యూ సాంగ్వి గ్రామంలో గోదావరిలో శుద్ధి చేసుకుని దిలావర్ పూర్ గ్రామంలో ప్రవేశించారు.చుట్టుపక్కల గ్రామాల వారు రోడ్డుకు ఇరువైపులా బారులు తిరి అమ్మవారి నగలకు స్వాగతం పలికారు.సందోహం నడుమ ఊరేగింపుగా దిలావర్ పూర్ మండలంలో గల గోదావరి నదికి అమ్మవారు పయనం అయ్యారు.

మండలంలోని ఆడేల్లి సారంగాపూర్ యాకర్పల్లి, వంజర్, ప్యారమూర్ గ్రామాల మీదుగా దిలావర్ పూర్ మండలంలోని కదిలి, మాటేగాం, కంజర్, సాంగ్విమాటేగాం కంజర్, సాంగ్వి గ్రామాల గుండా రాత్రి వరకు ఊరేగింపు గోదావరి నదికి చేరుకుంటుంది.ఆభరణాల ఊరేగింపునకు చుట్టుపక్కల గ్రామాల భక్తులు ( Devotees )మంగళహారలతో స్వాగతం పలికారు.

పలువురు పొర్లుదండాలు కూడా పెట్టారు.

Telugu Audellipochamma, Devotees, Ganga, Godavari, Godavari Sang, Sarangapur-Lat

గంగ పుత్రులు వలలతో గొడుగులు పట్టి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు.అమ్మవారికి డిఎస్పి గంగారెడ్డి, నిర్మల్ రూలర్ సిఐ శ్రీనివాస్, సారంగాపూర్ ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో పవిత్ర గోదావరి( Godavari ) నీటితో జలభిషేకం తర్వాత తిరిగి బయలుదేరుతారు.ఇవే గ్రామాల మీదుగా ఊరేగింపుగా సాయంత్రానికి నగలు గంగా జలాలతో ఆలయానికి చేరుకోవడంతో జాతర ముగుస్తుంది.

ఈ జలాలతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత అమ్మవారికి అభిషేకం జరిపి వీటిని ఇళ్లలో, పంట పొలాల్లో చల్లుకుంటారు.దీంతో పాడి పంటలు, పిల్ల పాపలు చల్లగా ఉంటారని భక్తులు నమ్ముతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube