జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం చంద్రుడు కర్కాటకం లోకి వెళ్ళినప్పుడు అంగారక గ్రహం బలహీనబడుతుంది.చంద్రుడు జల కారక గ్రహం.
అంగారకుడు అగ్నికారక గ్రహం.అందువల్ల కర్కాటకంలో అంగారకుడు బలహీనంగా ఉంటాడు.
కుజుడు మే 10న కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు.జులై ఒకటి వరకు అక్కడే ఉంటాడు.
ఈ సమయంలో శని నుంచి షడష్టక యోగం కూడా ఏర్పడుతుంది.ఈ సంచారము ఈ రాశుల వారికి అంత మంచిది కాదు.
ఈ సమయంలో ఈ రాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది.ముఖ్యంగా చెప్పాలంటే అంగారకుడి సంచారం మిధున రాశి( Gemini ) వారికి ఇబ్బందికరంగా ఉంటుంది.
అలాగే ఆస్తికి సంబంధించిన ఏవైనా వివాదాలు ఏర్పడవచ్చు.అంతేకాకుండా ఈ సమయంలో మీరు కోర్టు కేసులకు హాజరవాల్సి వస్తుంది.
అందువల్ల ఎక్కడపడితే అక్కడ సంతకాన్ని పెట్టకూడదు.డబ్బు పెట్టబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కుటుంబంలో వివాదాలు వచ్చే అవకాశం ఉంది.

ఇంకా చెప్పాలంటే సింహరాశి( Leo )లోని 12 వ ఇంట్లో అంగారకుడు సంచారం జరుగుతుంది.బలహీనమైన రాశిలో కుజుడు సంచరించడం వల్ల మీ ఖర్చులు పెరుగుతాయి.ఈ సమయంలో మీరు అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మానసిక ఒత్తిడి పెరుగుతుంది.మీ తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది.
భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా మీకు ఇబ్బందిని కలిగిస్తాయి.విదేశాలలో నివసించే వారు జాగ్రత్తగా ఉండడమే మంచిది.
అలాగే ధనస్సు రాశిలోని ఎనిమిదవ ఇంట్లో కుజోడి సంచారం జరుగుతుంది.ఈ రాశి వారికి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురవుతాయి.
బ్లడ్ ఇన్ఫెక్షన్ సమస్య ( Blood infection )ఉన్నవారు జాగ్రత్తగా ఉండడమే మంచిది.మీ అత్తమామలతో ఇలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకూడదు.
భార్యతో గొడవ పడకూడదు.ఈ సమయంలో వైవాహిక జీవితంలో గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.
డబ్బును తెలివిగా పెట్టబడి పెట్టడం ఎంతో మంచిది.