పురటాసి శనివారం రోజు.. పిండి దీపాన్ని ఈ సమయంలో వెలిగిస్తే..?

ముఖ్యంగా చెప్పాలంటే పురటాసి( Puratasi ) శనివారం ఉదయం 5:30 కు పిండి దీపాన్ని వెలిగిస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం అవుతాయని చాలా మంది ప్రజలు నమ్ముతారు.అలాగే అప్పుల బాధలు దూరమై ఆర్థిక సమస్యలు( Financial problems ) తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

 On Puratasi Saturday.. If You Light The Bread Lamp At This Time , Puratasi , F-TeluguStop.com

తిరుపతిలో భాద్రపదం పురటాసి మాసంలో బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతాయి.అలాంటి పురటాసి మాసంలో వచ్చే శనివారం శ్రీహరిని పూజించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయి.

పురటాసి శనివారం ఉపవాసం ఉండే వారు ముందుగా ఇంట్లో పూజ గదిని( Pooja room ) శుభ్రం చేసి రంగవల్లికలతో పూజ గదిని అలంకరించాలి.

తర్వాత శ్రీనివాసుని చిత్రం ముందు పంచ దీపాన్ని వెలిగించాలి.అంతే కాకుండా పసుపు రంగు పుష్పాలు, చక్కెర, పొంగలి, నువ్వుల అన్నం, గారెలతో నైవేద్యం సమర్పించాలి.అలాగే పురటాసి మాసంలో ప్రతి శనివారం రోజు దీపాలు వెలిగించి పూజలు నిర్వహిస్తే శ్రీవారి అనుగ్రహం మీ ఇంటి పై ఎప్పుడూ ఉంటుంది.

అంతే కాకుండా బియ్యపు పిండి, బెల్లం కలిపి ఆ పిండితో దీపం వెలిగించడం మర్చిపోకూడదని పండితులు చెబుతున్నారు.ఈ దీపాన్ని నేతితో వెలిగించడం మంచిది.లేకుంటే నువ్వుల నూనెను( Sesame oil ) ఉపయోగించవచ్చు.

ఇంకా చెప్పాలంటే పూజ అనంతరం కొబ్బరి తురుము వేసి ఆ పిండితో కలిపి అందరికీ ప్రసాదం పంచిపెట్టాలి.అంతే కాకుండా తులసీ, తామర, కుంకుమలతో శ్రీవారిని అలంకరించడం వల్ల సర్వాభీష్ఠాలు చేగురుతాయి.అలాగే పురటాసి మూడో శనివారం ఉపవాసం ఉంటే ఇంటి ఇలవేల్పు అనుగ్రహం లభిస్తుంది.

అలాగే సంపద వృద్ధి కూడా చెందుతుంది.ఇంకా చెప్పాలంటే మీ బాధలు కూడా దూరమైపోతాయి.

అలాగే మీ ఇంటి కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలంటే ఖచ్చితంగా పురటాసి శనివారం రోజు ఈ పనులన్నీ చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube