మన హిందూ సంప్రదాయంలో ఎన్నో ఆచారాలు,నియమాలు ఉన్నాయి.వాటిని చాలా మంది ఆచరిస్తూ వస్తున్నారు.
అయితే కొంత మంది మాత్రం ఈ ఆచారాల గురించి పెద్దగా పట్టించుకోరు.ఈ ఆచారాలు పాటించటం అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.
ఇప్పుడు ఆ ఆచారాలలో ఒక దాని గురించి చెప్పుకుందాం.సాధారణంగా పెళ్ళైన స్త్రీలు ప్రతి రోజు తలస్నానము చేసి పనులను మొదలు పెడుతూ ఉంటారు.
అలాంటి
వారి విషయంలో పెద్దగా పట్టింపు లేదు.
కానీ వారంలో ఒకటి లేదా రెండు సార్లు తలస్నానము చేసే వారు మాత్రం కొన్ని ఆచారాలను పాటించాలి.
సాధారణంగా పెళ్ళైన ప్రతి స్త్రీ శుక్రవారం తలస్నానం చేస్తూ ఉంటుంది.కానీ శుక్రవారం అసలు తలస్నానము చేయకూడదు.
దాని వలన సకల
సౌఖ్యాలకు దూరం అయ్యి, దరిద్రం పట్టుకుంటుంది.రోజూ తలస్నానం చేసే వారికి
అలాంటి నియమాలు ఉండవు.
అసలు ఏ రోజు తలస్నానము చేస్తే మంచి కలుగుతుందో తెలుసుకుందాం.సోమవారం తలస్నానం చేస్తే సౌభాగ్యం కలుగుతుంది.బుధవారం తలస్నానం చేస్తే భార్య భర్తలు ఇద్దరూ ఐకమత్యంగా, ఎంతో అన్యోన్యంగా ఉంటారని హిందూ పురాణాలు చెపుతున్నాయి.శనివారం తలస్నానము చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది.
చూసారుగా ఫ్రెండ్స్ ఈ వారాలలో తలస్నానము చేసి సౌభాగ్యం మరియు ఐశ్వర్యం పొందండి.