శరీరంలో మలినాలు పేరుకుపోయే కొద్ది వివిధ రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం పెరుగుతుంది.అందుకే ఎప్పటికప్పుడు బాడీని డిటాక్స్ చేసుకుంటూ ఉండాలి.
అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను డైట్ లో చేర్చుకుంటే బాడీ డిటాక్స్ అవ్వడమే కాదు వెయిట్ లాస్ సైతం అవుతారు.మరి ఇంకెందుకు ఆలస్యం బాడీని డిటాక్స్ చేయడమే కాకుండా వెయిట్ లాస్ కు సహాయపడే ఆ సూపర్ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలి.? మరియు ఎప్పుడు తీసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేయండి.
ముందుగా ఒక బౌల్ ను తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ మరియు ఒక కప్పు వాటర్ వేసుకుని గంట పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక కీర దోసకాయ తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి సన్నగా స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.
అలాగే అర అంగుళం అల్లం ముక్కను తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కీర దోసకాయ స్లైసెస్, అల్లం ముక్కలు మరియు రెండు లేదా మూడు లెమన్ స్లైసెస్ వేసుకోవాలి.
చివరిగా ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జ్యూస్ లో ముందుగా నానబెట్టుకున్న చియా సీడ్స్ ను మిక్స్ చేసి ఉదయాన్నే ఖాళీ కడుపుతో సేవించాలి.ప్రతిరోజు ఈ డ్రింక్ ను తీసుకుంటే గనుక శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు తొలగిపోతాయి.
బాడీ డిటాక్స్ అవుతుంది.అదే సమయంలో ఈ డ్రింక్ మెటబాలిజం రేటును పెంచి క్యాలరీలు కరిగే వేగాన్ని రెట్టింపు చేస్తుంది.
ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.పైగా ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల చర్మం హెల్తీగా మరియు నిగారింపుగా సైతం మారుతుంది.
కాబట్టి తప్పకుండా ఈ సూపర్ డ్రింక్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.







