సాధారణంగా టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న ఇద్దరు ముగ్గురు భామల మధ్య అప్పుడప్పుడు చిన్నపాటి కోల్డ్వార్ జరగడం చూస్తూనే ఉంటాము.మీరు ఇలాంటి కోల్డ్ వార్ ఏదైనా ఉంది అంటే అది సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.
అయితే గత రెండేళ్ల నుంచి కూడా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇలాంటి కోల్డ్ వార్ జరుగుతుంది అన్నది తెలుస్తుంది.ప్రస్తుతం టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత మిగతా స్టార్ హీరోయిన్లకు మధ్య ఇలాంటి వార్ నడుస్తుందట.
గతంలో పూజా సమంత అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఎంతలా యుద్ధాలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక ఇప్పుడు అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్న హాట్ బ్యూటీ సమంతకు కూడా పడటం లేదని గుసగుసలు ఇండస్ట్రీలో గుప్పుమన్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లలో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుని నెంబర్ వన్ స్థానంలో వినిపించే పేరు మాత్రం సమంత అని చెప్పాలి.ఇటీవలి కొన్ని సర్వేలు కూడా ఇదే విషయాన్ని చెప్పకనే చెప్పాయి.
ముఖ్యంగా విడాకుల తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా సమంత దూసుకుపోతున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బాలీవుడ్ ఆఫర్ల విషయంలో మరింత ఆసక్తి కనబరుస్తుంది సమంత.
అయితే సమంత ఇలా ఎందుకు చేస్తుంది అన్న ప్రశ్నకు రష్మిక మందన పేరు ఎక్కువగా వినిపిస్తుంది.రష్మిక పుష్ప సినిమాతో బాలీవుడ్ కు దగ్గరైంది.నేరుగా హిందీలో నటించిన సినిమా ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. మిస్టర్ మజ్ను, గుడ్ బై, యానిమల్ లాంటి బాలీవుడ్ ప్రాజెక్టులతో దూసుకుపోతుంది.

ఈక్రమంలోనే జోరుమీద ఉన్న రష్మిక మందన తనను దాటి పోకూడదు అనే ఆలోచనతో ప్రస్తుతం రష్మిక మందనకు బ్రేక్ వేసేందుకు సమంత రెడీ అవుతోందట.బాలీవుడ్ లో నటిస్తున్న మూడు ప్రాజెక్టులను ఒకేసారి ప్రకటించాలని చూస్తుందట.అలా చేయడం వల్ల ఇక రష్మిక కు షాక్ ఇవ్వాలని చూస్తుందట.యువ హీరోయిన్ రష్మిక పై తనదే పైచేయి అన్నట్లుగా అని నమ్మించే ప్రయత్నం చేస్తుందట సమంత.
ఇలా వీరి మధ్య చిన్నపాటి కోల్డ్వార్ జరుగుతుంది అన్నది మాత్రం తెలుస్తుంది.ఇది కాస్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.అయితే సినిమాలు చేస్తే సరిపోదు ఆ సినిమాలు విజయం సాధించాలి.మరి ఇలాంటి విజయాలతో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.