పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , క్రిష్ ( Power Star Pawan Kalyan, Krish )కాంబినేషన్ లో తెరకెక్కిన హరిహర వీరమల్లు సినిమాపై ( Harihara Veeramallu )ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.ఈ నెల 28వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా ఆ సమయానికి ఈ సినిమా విడుదలవుతుందో లేదో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.
అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ కు సంబంధించి ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గజదొంగ పాత్రలో కనిపించనున్నారనే సంగతి తెలిసిందే.
సినిమాలో పవన్ పడవలో ఎక్కిస్తున్న వజ్రాలను కొట్టేస్తానని పడవ యజమానికి చెప్పి మరీ కొట్టేస్తాడని సమాచారం అందుతోంది.ఈ ఇంట్రడక్షన్ సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తోంది.
దేవర సినిమాలో సైతం ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ దాదాపుగా ఇదే విధంగా ఉంటుందనే సంగతి తెలిసిందే.

హరిహర వీరమల్లు సినిమాలో పవన్ నెక్స్ట్ లెవెల్ లో కనిపిస్తాడని సినిమా మాత్రం పవన్ రేంజ్ ను పెంచేలా ఉంటుందని తెలుస్తోంది.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుండగా ఇతర భాషల ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.హరిహర వీరమల్లు సినిమా కోసం 300 కోట్ల రూపాయల( 300 crore rupees ) కంటే ఎక్కువ మొత్తం ఖర్చు అయిందని తెలుస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాలతో మరిన్ని రికార్డులను క్రియెట్ చేయాలని ఫ్యాన్స్ సైతం ఫీలవుతున్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ రాబోయే రోజుల్లో పెరగాలని ఈ హీరో మరిన్ని సంచలన రికార్డులను బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.పవన్ రెమ్యునరేషన్ 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.







