ప్రస్తుత రోజుల్లో ఇంటికి ఒకరైన షుగర్ వ్యాధిగ్రస్తులు( Diabetic Patients ) ఉంటున్నారు.నిశ్చల జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, శరీరానికి శ్రమ లేకపోవడం తదితర కారణాల వల్ల ప్రతి ఏడాది కోట్లాది మంది షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు.
షుగర్ వ్యాధి రాగానే చాలా మంది పలు ఆహారాలను దూరం పెడుతుంటారు.ఈ జాబితాలో పండ్లు కూడా ఒకటి.
ముఖ్యంగా తియ్యా ఉండే పండ్ల జోలికి అస్సలు పోరు.ఈ నేపథ్యంలోనే షుగర్ వ్యాధి ఉన్నవారు స్ట్రాబెర్రీ పండ్లు( Strawberries ) తినవచ్చా.? తినకూడదా.? అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.రుచిగా మరియు చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపించే పండ్లలో స్ట్రాబెర్రీ ఒకటి.అయితే తియ్యగా ఉంటాయి కాబట్టి స్ట్రాబెర్రీ పండ్లను షుగర్ వ్యాధి ఉన్నవారు ఎవైడ్ చేస్తుంటారు.
కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం షుగర్ వ్యాధి ఉన్నవారు స్ట్రాబెర్రీలను దూరం పెట్టాల్సిన అవసరం లేదు.మితంగా ఆస్వాదించవచ్చు.

షుగర్ వ్యాధిగ్రస్తులకు స్ట్రాబెర్రీ పండ్లు ఎంతో మేలు చేస్తాయి.ఫైబర్ అధికంగా ఉండే ఈ పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి.మరియు విటమిన్ సి( Vitamin C ), యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.అందుకే స్ట్రాబెర్రీలను షుగర్ వ్యాధి ఉన్నవారికి ప్రయోజనకరంగా భావిస్తారు.సహజ తీపి ఉన్నప్పటికీ, స్ట్రాబెర్రీలు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి.కాబట్టి మధుమేహులకు స్ట్రాబెర్రీ పండ్లు ఎటువంటి హాని చేయవు.
అలాగే పైన చెప్పుకున్నట్లు స్ట్రాబెర్రీ పండులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.ఇది చక్కెర పోషణను నెమ్మదించేలా చేస్తుంది.
స్ట్రాబెర్రీలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇన్సులిన్ రెసిస్టెన్స్( Insulin Resistance )ని తగ్గిస్తాయి.

అందువల్ల షుగర్ వ్యాధి ఉన్నవారు ఎలాంటి భయం లేకుండా స్ట్రాబెరీ పండ్లను తీసుకోవచ్చు.కానీ అతిగా తీసుకుంటే మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణమవుతాయి.ఇకపోతే స్ట్రాబెర్రీ పండ్లను డైట్ లో చేయించుకోవడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది.
రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్( Bad Cholesterol ) కరిగి గుండె ఆరోగ్యంగా మారుతుంది.చర్మం నిగారింపుగా మెరుస్తుంది.స్ట్రాబెర్రీ పండ్లలో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ పవర్ ను సైతం అద్భుతంగా పెంచుతాయి.