రూట్ మార్చిన నవీన్ చంద్ర.. విజయం అందుకుంటాడా..??

అందాలరాక్షసి సినిమాతో నవీన్ చంద్ర మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆయన సినీ జీవితం మొదలైన దగ్గర నుండి విలక్షణమైన పాత్రలు వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు.

 Naveen Chandra Root Changed And Faith Will Be , Tollywood , Naveen Chdra , As Av-TeluguStop.com

ఇక అవకాశం దొరికినప్పుడు హీరోగా నటిస్తూ, మరోపక్క విలన్ గా కూడా నటిస్తూండు.ఆయన అరవింద సమేత వీర రాఘవ’ ‘దేవదాస్’ సినిమాలలో నెగటివ్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
>

అయితే నవీన్ సంభవామి యుగే యుగేసినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.ఆయన తెలుగుతో పాటు తమిళ్ లో కూడా పలు చిత్రాల్లో నటించిన నవీన్ చంద్ర ధనుష్ హీరోగా నటించిన పటాస్సినిమాలో పూర్తి స్థాయి విలన్ గా మెప్పించారు.

ఇక కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన మిస్ ఇండియాసినిమాలో నటిస్తున్నారు.అంతేకాదు హీరోగా, విలన్ గా ఏ క్యారెక్టర్ నచ్చితేఆ క్యారెక్టర్ లో నటించడానికి నవీన్ చంద్ర ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేస్తున్నారు.

Telugu Andala Rakshshi, Avillian, Danush, Nanu, Naveen Chandra, Naveen Chdra, Pa

కాగా.ఆయన ఇప్పుడు ట్రెండ్ కు అనుగుణంగా భానుమతి రామకృష్ణవెబ్ మూవీలో కూడా నటించారు.ప్రస్తుతం వెబ్ రంగం అలాంటి క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు.

అయితే వెబ్ ఫిల్మ్ లో నవీన్ చంద్రతో పాటు సలోని లుథ్రా రాజా చెంబోలు హర్ష ప్రధాన పాత్రలలో నటించారు.అంతేకాక. శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో కృశివ్ ప్రొడక్షన్స్ మరియు హ్యాండ్ పిక్డ్ స్టోరీస్ బ్యానర్లపై యశ్వంత్ ములుకుట్ల తెరకెక్కించారు.

Telugu Andala Rakshshi, Avillian, Danush, Nanu, Naveen Chandra, Naveen Chdra, Pa

ఇక ఇటీవల విడుదలైన ఈ వెబ్ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.అంతేకాక అచ్చు రాజమణి నేపథ్య సంగీతం అందించగా శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించారు.అయితే సిటీలోని అమ్మాయి, తెనాలి నుండి సిటీకి వచ్చిన అబ్బాయి మధ్య ప్రేమ ఎలా పుట్టిందనే కథాంశంతో ఈ మూవీ రూపొందిందని ట్రైలర్ ని చూస్తూనే ఐపోతుంది.

అయితే త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube