ఆయిలీ స్కిన్. ఎందరినో వేధించే కామన్ చర్మ సమస్య ఇది.
అందు లోనూ ఇప్పుడు వస్తోన్న సమ్మర్‌లో ఈ ఆయిలీ స్కిన్ సమస్య మరింత తీవ్రంగా ఇబ్బంది పెడు తుంటుంది.ఎన్ని సార్లు వాటర్‌తో ముఖాన్ని శుభ్ర పరుచుకున్నా.
మళ్లీ క్షణాల్లో జిడ్డు జిడ్డుగా మారిపోతుంటుంది.దాంతో ఈ సమస్యను నివారించుకోవడం కోసం ఖరీదైన ఫేస్ వాష్‌లు, రక రకాల స్క్రబ్బింగ్ ప్యాకులను వాడుతుంటారు.
అయితే ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే చింతపండుతోనూ ఈ సమస్యను నివారించు కోవచ్చు.
అవును, చింతపండులో ఉండే కొన్ని ప్రత్యేక సుగుణాలు చర్మంపై ఉన్న జిడ్డు మొత్తాన్ని వదిలించడంలో అద్భుతంగా సహాయ పడతాయి.
మరి ఇంతకీ స్కిన్‌కి చింత పండును ఎలా వాడాలో తెలుసు కుందాం పదండీ.ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా చింత పండు, అర కప్పు నీళ్లు పోసి మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్‌లో నీటితో సహా చింత పండు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు మరో బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల చింత పండు పేస్ట్, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్,
వన్ టేబుల్ స్పూన్ తేనె,
వన్ టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్, హాప్ టేబుల్ స్పూన్ పెరుగు, రెండు చుక్కలు విటమిన్ ఇ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ జోజోబా ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా హ్యాండ్ బ్లెండర్ సాయంతో మిక్స్ చేసుకోవాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా రుద్దు కోవాలి.అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.
రోజులో ఒక్క సారి ఇలా చేస్తే గనుక.చర్మంపై పేరుకు పోయిన అదనపు జిడ్డం మొత్తం తొలగిపోయి ముఖం కాంతి వంతంగా, ఫ్రెష్‌గా మారుతుంది.
.