ముఖ్యంగా చెప్పాలంటే దేనికైనా సమయం రావాలి అని పెద్దవారు ఎక్కువగా చెబుతూ ఉంటారు.వాస్తు దోషం( Vastu Dosham ) జాతకంలో గ్రహ దోషం ఏది లేకపోయినా ఒక్కోసారి పనులు సరిగ్గా జరగవు.
పనులు ఎందుకు జరగడం లేదో అసలు అర్థం కాదు.మనం ఉంటున్న ఇంటిలో వాస్తు సరిగ్గా ఉంటుంది.
జాతకంలో గ్రహాలకు కదలికలు కూడా సరిగ్గా ఉన్నాకూడా పనులు జరగకపోవడానికి ఒక చిన్న లోపం ఉంటుంది.ఇంట్లో కొన్ని వస్తువుల అమరిక కూడా ఇలా ఆటంకాలను కలిగించవచ్చు.
అందుకే ఇంట్లో ఏ ప్రదేశంలో ఏ వస్తువు ఉంచాలో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.
ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండాలంటే కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలంటే ఇంట్లోనీ నైరుతి మూలలో పింక్ లేదా ఎరుపు రంగు పువ్వులను( Flowers ) అలంకరించడం ఎంతో మంచిది.ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉంటే త్వరగా వివాహం ( Marriage ) కుదరాలంటే ఇంటి ప్రధాన ద్వారం బయట సుగంధం వెలువరించే మల్లెల వంటి పువ్వుల బొమ్మను ఉంచడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.ఇంటి ఆగ్నేయ దిశలో నారింజ మొక్క షోపీస్ లేదా చిత్రాన్ని అలంకరిస్తే ఇంటికి శుభమని చెబుతున్నారు.
పిల్లలు చదువుకునే గదిలో ఈశాన్యములలో నాలుగు క్రిస్టల్ బాల్స్ వేలాడదీయడం( Crystal Balls ) ఎంతో మంచిది.ఇవి పిల్లలలో ఏకాగ్రత పెంపొందించేందుకు దోహదం చేస్తాయి.
ఇంటికి దక్షిణం వైపు ఎర్రని విగ్రహం లేదా ఎరుపు రంగు చిత్రాన్ని అలంకరిస్తే అన్ని పనుల్లో మంచి ఫలితాలు ఉంటాయి.
ఇంట్లో ఏదైనా గదిలో దక్షిణం వైపు గోడకు ఫినిక్స్ పక్షి చిత్రాన్ని( Phoenix Bird )దానికి వేలాడదీసి అలంకరిస్తే ఇంట్లో శాంతి ఉంటుంది.యుద్ధం, హింసాత్మక చిత్రాలు, భయంకరంగా ఉండే విగ్రహాలను ఇంట్లో ఉంచకూడదు.ఇవి కుటుంబ సభ్యుల మీద చెడు ప్రభావాన్ని చూపుతాయి.
పూజకు వాడే విగ్రహాలు 6 అంగుళాలు మించకుండా ఉండాలి.అలాగే పూజ గదిలో ఎవరూ నిద్రపోకూడదు.
ఒకటికంటే ఎక్కువ అంతస్తులు ఇల్లు ఉన్నప్పుడు మాస్టర్ బెడ్ రూమ్ అన్నిటికంటే పై అంతస్తులో ఉండాలి.
DEVOTIONAL