ఆషాడం మాసానికి( Ashada.) తెలుగు మాసాలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.సాధారణంగా ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు.కానీ ఈ సమయంలో పితృ కార్యాలు, జపహోమాలు చేయడానికి శుభప్రదమైనది.ఈ మాసంలో రాగి పాత్రలో నీళ్లు, అక్షింతలు పువ్వులు, రోలీ పోసి సూర్య భగవానుడికి ఆర్ఘ్యం ( Lord Sun )సమర్పిస్తారు.ఈ సాంప్రదాయం ఎన్నో ఏళ్ల నుంచి వస్తోంది.
ఇలా చేయడం వల్ల సూర్యభగవానుడు ముక్తిని పొందుతారు.అలాగే ఈ మాసంలో గొడుగు, ధాన్యం, డబ్బులు దానం చేస్తే చాలా మంచిది అని చెబుతారు.
అంతేకాకుండా ఈ మాసంలో అంటువ్యాధులు కూడా ఎక్కువగా వస్తాయి.అందుకే గ్రామాలలో ఉన్న దేవతలకు ఆమెకి ఇష్టమైన ఆహారాన్ని సమర్పిస్తారు.

ఇలా సమర్పిస్తే మన వద్దకు ఎలాంటి వ్యాధులు కూడా రావు.అలాగే ఈ మాసంలో పెళ్లిళ్లు కూడా చేయరు.అలాగే యజ్ఞాలు, హోమాలు కూడా చేయరు.అలాగే ఉపవాసాలు కూడా చేయకూడదు.
ఎందుకంటే దేవతలు ఈ మాసంలో నిద్రవస్తలో ఉంటారు.కాబట్టి చేయకూడదని ఆచారం ఉంది.
అయితే ఈ సమయంలో ఉపవాసాలు, తర్పణాలు, దానాలు చేయకూడదని చెబుతూ ఉంటారు.ఇక ఆషాడ మాసంలో గురువారాలు అమ్మవారి ఆర్జన ఎంతో విశిష్టమైనవి.
ఆషాడ ఆదివారాలు దుర్గాదేవికి.ఆషాడ గురువారాలు లక్ష్మీదేవి( Lakshmi devi )కి విశిష్టమైనవిగా చెబుతారు.
అయితే ఈ మాసంలో అమ్మవారి దేవాలయానికి దీపం పెట్టి నమస్కారం చేసుకోవాలి.

అంతేకాకుండా గుళ్లో బోనాలు కూడా సమర్పిస్తారు.ఇక కొన్ని చోట్ల అమ్మవారికి పసుపు కుంకుమ కూడా పూసి, ఒడిబియ్యం వేస్తారు.అయితే గ్రామాలలో పసుపు, కుంకుమ, వేపాకులు వేయడం వలన గ్రామం శుభ్రం అవుతుందని ఒక నమ్మకం.
అలాగే ఇంటికి వేపాకులు కట్టడం వలన ఇంట్లోకి ఎలాంటి శక్తులు కూడా ప్రవేశించవు.అయితే ఆషాడమాసం అంటే వర్ష ఋతువు.కాబట్టి అలాంటి సమయంలో ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి.ఈ పరిస్థితుల్లో ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా తగిన జాగ్రత్తలు చూసుకోవాలి.
ఆషాడమాసాన్ని శూన్య మాసం అని అంటారు.అయితే ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు.
పితృ తర్పణాలు, యజ్ఞ హోమాలు మాత్రమే చేయాలి.