75 అంశాలపై చర్చించనున్న పాలక మండలి.రేపటితో ముగియనున్న వైవీ.
సుబ్బారెడ్డి పాలకమండలి గడువు.నేటితో టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి( Y.V.Subba Reddy ) నేతృత్వంలోని చివరి పాలకమండలి సమావేశం ప్రారంభంమైంది.సోమవారం ఉదయం 10 గంటలకు తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టిటిడి ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి అధ్యక్షణ చేత ప్రారంభంమైన పాలక మండలి సమావేశంలో పాలకమండలి సభ్యులందరూ పాల్గొన్నారు.
రేపటితో వైవీ.సుబ్బారెడ్డి పాలక మండలి గడువు ముగినుండడంతో నేడు పాలక మండలి సమావేశంలో దాదాపు 75 అంశాలతో కూడిన ఆజెండాని టిటిడి అధికారులు సిద్ధం చేశారు.
ఈ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు.ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో నిర్వహించనున్న బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై పాలకమండలి చర్చ జరుగనుంది.
ల్యాబ్ ఆధునికరణకీ 5 కోట్లు రూపాయలు కేటాయింపుపై చర్చ జరుగనుంది.దాదాపు 1000 కంప్యూటర్ల కొనుగోలు టెండర్ ఆమోదంపై పాలకమండలి నిర్ణయం తీసుకొనుంది.
ఇక పలు ముడి సరుకులు కొనుగోలు, ఇంజనీరింగ్ పనులకు టిటిడి( TTD ) పాలక మండలి ఆమోదం తెలపనుంది.