ఆశ్వయుజమాసంలో వచ్చే నవరాత్రులకు ఎంతో ప్రత్యేకత ఉంది.ఈ నవరాత్రులలో భాగంగా సాక్షాత్తు అమ్మవారు భూమిపైకి వచ్చి ప్రజల కోర్కెలను తీర్చే వారిని కాచి కాపాడతారని భక్తులు విశ్వసిస్తారు.
ఈ క్రమంలోనే నవరాత్రులలో భాగంగా తొమ్మిదిరోజులపాటు అమ్మవారికి వివిధ అలంకరణలో పూజలు చేసి వివిధ రకాల నైవేద్యాలతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.ఈ క్రమంలోనే కొందరు భక్తులు ఉపవాస దీక్షలతో నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.
ఎంతో ముఖ్యమైన పవిత్రమైన ఈ నవరాత్రులలో భాగంగా మనం మన ఇంట్లో కొన్ని చిన్న మార్పులు చేస్తే మన ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయని పండితులు చెబుతున్నారు.ఈ మార్పులు చేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల తొలగిపోయి అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి.
నవరాత్రుల సమయంలో మనం చేయాల్సిన పనులలో ముందుగా మన ఇంటి ద్వారానికి స్వస్తిక్ గుర్తులు వేయడం ఎంతో శుభకరం.ఈ గుర్తు శుభానికి సంకేతం కనుక మన ఇంట్లో అన్ని శుభాలే జరగాలని అమ్మవారిని వేడుకోవాలి.
నవరాత్రులలో భాగంగా ప్రతి రోజు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరిస్తారు కనుక తప్పకుండా మన ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణం కట్టాలి.నవరాత్రులలో సాక్షాత్తు అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించాలని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తాము.

ఈ సమయంలోని ప్రధాన ద్వారం పై అమ్మ వారి పాదముద్రలను వేయటం ఎంతో మంచిది.ఇలా అమ్మవారి పాదముద్రలు ఉండటం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు.నవరాత్రులలో భాగంగా ఎలాంటి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు.అదేవిధంగా మహిళలు లేదా పురుషులు జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం వంటి పనులను ఈ నవరాత్రులలో చేయకూడదు.
వీలైనంతవరకు నవరాత్రుల పూజ చేసేవారు సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.