ఇంట్లో శుభ సంకేతాలు కలగాలంటే.. తులసి మొక్కతో పాటు ఈ మొక్కను నాటాలి..!

హైందవ సంస్కృతి( Hindu culture )లో తులసిని ఎంతో పవిత్రమైన మొక్కను, భగవత్ స్వరూపంగా పరిగణిస్తారు.ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఈ మొక్కను పూజిస్తూ ఉంటారు.

 For Auspicious Signs At Home.. This Plant Should Be Planted Along With Tulsi Pla-TeluguStop.com

తులసి మొక్క( Basil plant )లో సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి నివసిస్తుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.తులసి పూజ మహాలక్ష్మి, విష్ణువును ప్రసన్నం చేస్తుందని భావిస్తారు.

లేకుంటే అ శుభ ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఏకాగ్రత తదేక దీక్ష తో ఎంత పని చేసినా ఆ పని చెడిపోతుంటే ఇంట్లో కృష్ణ తులసి మొక్కను నాటాలి.

ఆ తర్వాత ప్రతి రోజు సాయంత్రం ఆ తులసి మొక్క దగ్గర స్వచ్ఛమైన నెయ్యి దీపం వెలిగించాలి.

ఇలా చేయడం వల్ల మీ పనులలో ఆటంకాలు త్వరగా తొలగిపోతాయి.ఇంట్లో తులసి మొక్క ఉంటే దానితో పాటు అరటి మొక్క( Banana plant )ను కూడా నాటవచ్చు.ఈ రెండు మొక్కలు ఎంత దగ్గరగా ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయి.

రెండు మొక్కలకు నీరు పోసి ఉదయం, సాయంత్రం దీపం వెలిగించాలి.ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం కలుగుతుంది.

ఇంకా చెప్పాలంటే కార్తీక మాసం( Kartika month )లో 30 రోజులు తులసి మొక్క కింద నెయ్యి దీపాన్ని వెలిగించాలి.మీరు దీపం వెలిగించకపోతే దేవోత్థాన ఏకాదశి నుంచి కార్తీక పూర్ణిమ వరకు కనీసం ఐదు రోజులు అయినా దీపం వెలిగించాలి.

తులసిని పూజించడం వల్ల లక్ష్మీదేవితో పాటు కుబేరుని అనుగ్రహం కూడా లభిస్తుంది.

తులసికి నీళ్లు నైవేద్యంగా సమర్పించడమే కాకుండా ఇతర జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఎప్పుడూ ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో నాటడం ఎంతో మంచిది.అలాగే స్వస్తిక్, ఓం, శంఖం, చక్రం ఈ చిహ్నాలు తులసి కోట దగ్గర లేదా తులసి మొక్క దగ్గర ఉంచడం శుభప్రదం అని పండితులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube