అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన TSRTC.. ముఖ్యంగా ఉచిత ప్రయాణం ఎవరికంటే..?

ముఖ్యంగా చెప్పాలంటే అయ్యప్ప భక్తులు కార్తీక మాసంలో మాలను ధరించి దీక్ష చేపట్టి భక్తిశ్రద్ధలతో ఆ మణికంఠ స్వామిని ఆరాధిస్తూ ఉంటారు.41 రోజులు నియమ నిష్ఠలతో దీక్ష చేపట్టిన స్వాములు 41 రోజుల తర్వాత శబరిమల కు వెళ్లి అయ్యప్ప స్వామి( Ayyappa Swamy )ని దర్శించుకుని ముడుపు చెల్లించి దీక్షను విరమిస్తారు.అయితే కేరళ రాష్ట్రంలోని శబరిమలకు వెళ్లేందుకు భక్తులు ప్రైవేట్ బస్సుల్లో, ట్రైన్లలో ప్రయాణిస్తూ ఉంటారు.కార్తిక మాసంలో చాలా మంది అయ్యప్ప మాలలు ధరిస్తారు.కాబట్టి భక్తులందరూ ఆ సమయంలో శబరిమలకు చేరేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.దీనితో చాలా మందికి ట్రైన్స్ టికెట్లు దొరకవు.

 Tsrtc Gave Good News To Ayyappa Devotees Especially Free Travel Than Who-TeluguStop.com

అలాంటి వాళ్ళు ప్రైవేట్ ట్రావెల్స్ ని సంప్రదిస్తారు.

Telugu Ayyappa Swamy, Bhakti, Devotees, Devotional, Kartika Masam, Kerala, Telan

ఈ క్రమంలో కార్తీక మాసం( Kartika ) సీజన్ కావడం చేత టికెట్ ధర అధికంగా ఉంటుంది.ఇది ప్రతి ఏడాది భక్తులు ఎదుర్కొనే ప్రధాన సమస్య అని భక్తులు చెబుతున్నారు.అయితే ఈ సంవత్సరం ఆ సమస్యను పరిష్కరిస్తూ అయ్యప్ప భక్తులకు TS ఆర్టీసీ( TSRTC ) శుభవార్త చెప్పింది.

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అద్దె ప్రతిపాదికన సూపర్ లగ్జరీ బస్సులు సమకూర్చేందుకు సిద్ధమైంది.సుశిక్షితులైన డ్రైవర్లతో మధురమైన ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ TS ఆర్టీసీ అద్దె ప్రతిపాదికన సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేస్తూ ఉంది.

కాగా ఈ సూపర్ లగ్జరీ బస్సుల్లో టీవీ సౌకర్యం కూడా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Telugu Ayyappa Swamy, Bhakti, Devotees, Devotional, Kartika Masam, Kerala, Telan

ముఖ్యంగా చెప్పాలంటే ఇద్దరు మణికంఠ స్వాములకు, ఇద్దరు వంట మనుషులకు, సామాన్లు సర్దేందుకు ఒక వ్యక్తికి ఉచితంగా ప్రయాణానికి అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.అలాగే ఆర్టీసీ బస్సును అద్దెకు బుక్ చేసిన గురుస్వామికి ఉచిత ప్రయాణం ఉంటుందని కూడా చెబుతున్నారు.అదే విధంగా ఒకటి కంటే ఎక్కువ బస్సులు బుక్ చేసిన గురుస్వామికి ఆ బస్సుపై రోజుకు 300 చొప్పున కమిషన్ కూడా ఇస్తామని చెబుతున్నారు.

అయితే శబరిమలకు వెళ్లేదారిలో ఇతర పుణ్యక్షేత్రాలు కూడా దర్శించుకునే వెసులుబాటు ఉంటుందని, మరిన్ని వివరాలకు సమీపంలో ఉన్న డిపో మేనేజర్లను సంప్రదించాలని TS ఆర్టీసీ ముఖ్య అధికారులు వెల్లడించారు.అయ్యప్ప భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube