లాంగ్ హెయిర్ కోసం ఆరాట‌ప‌డేవారికి ఈ రెమెడీ సూప‌ర్‌గా వ‌ర్కౌట్ అవుతుంది!

ఒక‌ప్పుడు ఏ అమ్మాయి జుట్టు చూసినా ఒత్తుగా, పొడ‌వుగా క‌నిపించేది.కానీ, ప్ర‌స్తుత రోజుల్లో పొడ‌వాటి జుట్టు ఉన్న అమ్మాయిలు చాలా అంటే చాలా అరుదుగా క‌నిపిస్తున్నారు.

 The Best Remedy For Those Who Want Long Hair! Long Hair, Best Remedy, Hair, Hair-TeluguStop.com

కొంద‌రు ఫ్యాష‌న్‌ పేరిట ఉన్న జుట్టును క‌త్తిరించుకుంటుంటే.మ‌రికొంద‌రు హెయిర్ గ్రోత్ లేక స‌త‌మ‌తం అవుతున్నారు.

ఏదేమైనా లాంగ్ హెయిర్ కోసం ఆరాట‌ప‌డేవారికి మాత్రం ఇప్పుడు చెప్ప‌బోయే హోమ్ రెమెడీ సూప‌ర్‌గా వ‌ర్కౌట్ అవుతుంది.ఎలాంటి జుట్టునైనా ఒత్తుగా, పొడ‌వుగా మారుస్తుంది.

మ‌రి ఇంకెందుకు లేటు ఈ రెమెడీ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.

తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్‌, అర క‌ప్పు ప‌చ్చి పాలు వేసుకుని అర గంట పాటు నాన‌బెట్టుకోవాలి.

ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో పాల‌తో స‌హా నాన‌బెట్టుకున్న ఓట్స్‌ను వేసుకోవాలి.అలాగే అందులో ఒక ఎగ్ వైట్‌, మూడు మందారం పువ్వులు, మూడు మందారం ఆకులు, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని మెత్త‌టి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Remedy, Care, Care Tips, Fall, Pack, Long-Latest News - Telugu

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మంలో వ‌న్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌, హాఫ్ టేబుల్ స్పూన్‌ గ్లిజ‌రిన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ఏదైనా బ్ర‌ష్ లేదా చేతి వేళ్ల‌తో జుట్టు కుదుళ్ల నుండి చివ‌ర్ల వ‌ర‌కు అప్లై చేసుకుని ష‌వ‌ర్ క్యాప్‌ను ధ‌రించాలి.గంట అనంత‌రం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.

వారంలో ఒక్క‌సారి ఈ విధంగా చేస్తే జుట్టు పొడుగ్గా, ఒత్తుగా పెరుగుతుంది.

అదే స‌మ‌యంలో ఈ రెమెడీని ట్రై చేయ‌డం వ‌ల్ల జుట్టు కుదుళ్లు బ‌లంగా మార‌తాయి.దాంతో హెయిర్ ఫాల్ స‌మ‌స్య సైతం దూరం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube