గుండెపోటు.సాధారణ జనాలను వదలని ఈ గుండెపోటు ప్రస్తుతం సెలబ్రెటీలను సైతం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
తాజాగా కోలీవుడ్ హీరో విక్రమ్ కి గుండెపోటు రావడంతో అటు కోలీవుడ్ మాత్రమే కాదు యావత్ ఇండియాలో ఆయన అభిమానులంతా కూడా షాక్ కి గురయ్యారు.ప్రస్తుతం కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ కోలుకోని త్వరగా ఇంటికి రావాలని ఆయన అభిమానులంతా కూడా ప్రార్థిస్తున్నారు.
ఇలా అతి చిన్న వయసులో విక్రమ్ కి హార్ట్ ఎటాక్ రావడం నిజంగా శోచనీయం.ఎందుకంటే విక్రమ్ ఫిజిక్ పై అత్యంత దృష్టి పెట్టే విక్రమ్ లాంటి హీరోలు గుండెపోటుకు గురికావడం అనేది వైద్యులకు కూడా అంతు పట్టని విషయం.ఇక ఇటీవల కాలంలో గుండెపోటుకు గురైన స్టార్ సెలబ్రిటీస్ ఎవరో ఒకసారి చూద్దాం.
పునీత్ రాజ్ కుమార్
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ జిమ్ లో వ్యాయామం చేస్తుండగా గుండెపోటుకు గురై కన్నుమూశారు.పునీత్ రాజ్ కుమార్ మరణంతో యావత్ సినీ పరిశ్రమ దుఃఖసాగరంలో మునిగిపోయింది.ఆయన మరణం కన్నడ ఇండస్ట్రీ కి తీరని శోకాన్ని మిగిల్చింది.
చిరంజీవి సర్జా
యాక్షన్ కింగ్ అర్జున్ కి అక్క కుమారుడు, వరసకు అల్లుడైన చిరంజీవి సర్జా అతి చిన్న వయసులో గుండెపోటుతో కన్నుమూశాడు.కేవలం నాలుగు పదులు నిండకుండానే గుండెపోటుకు గురయ్యాడు చిరంజీవి సర్జా.ఆయన భార్య మన తెలుగు హీరోయిన్ మేఘన.
సిద్ధార్థ శుక్లా
బిగ్ బాస్ విన్నర్ అలాగే చిన్నారి పెళ్లికూతురు హీరో సిద్ధార్థ్ శుక్లా సైతం నిద్రలోనే హార్ట్ ఎటాక్ తో కన్నుమూశారు.
రాజశేఖర్
PSV గరుడవేగ సినిమాకి ముందు రాజశేఖర్ గుండెపోటుతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.ఆ తర్వాత కరోనాతో మరోమారు రాజశేఖర ఆసుపత్రిపాలై కోరుకున్నారు.
శివాజీ రాజా
నటుడు శివాజీ రాజా కూడా గుండెపోటుతో సతమతమయ్యారు.కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిలో కొన్నాళ్లపాటు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఆ తర్వాత కోలుకొని తిరిగి నటించడం మొదలుపెట్టారు.