ప్రస్తుతం కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్( India , Bangladesh ) మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.వర్షం కారణంగా గడిచిన రెండు మూడు రోజులుగా ఆట సరిగా ముందుకు కొనసాగలేదు.
అయితే, నాలుగో రోజు వాతావరణంతో పాటు మైదానం సహకరించడంతో మ్యాచ్ కరెక్ట్ సమయానికి ప్రారంభం అయింది.అయితే భోజనం సమయం కంటే ముందు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ( Captain Rohit Sharma )క్యాచ్ అందరిని బాగా ఆకట్టుకోవడంతో పాటు ఆశ్చర్యానికి గురిచేసింది.
కేవలం ఒక్క చేత్తో గాల్లో ఎగిరి రోహిత్ శర్మ క్యాచ్ పట్టడం ఆటగాళ్లతో పాటు బంగ్లా బ్యాటెర్ లిటన్ దాస్ కూడా ఆశ్చర్యపోయాడు.
వాస్తవానికి ఆట నాలుగు రోజు బంగ్లాదేశ్ కు లిటన్ దాస్ చాలా బాగా బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు.లిటన్ దాస్ మూడు అద్భుతమైన ఫోర్లు కొట్టి వారి ఇన్నింగ్స్ భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లేలా కనిపించాడు.అయితే మహమ్మద్ సిరాజ్ వేసిన బంతిని కవర్ మీదుగా షార్ట్ కొట్టి ఫోర్ పంపెందుకు లిటన్ దాస్ ప్రయత్నం చేయగా ఈ క్రమంలో రోహిత్ శర్మ గాల్లో అద్భుతంగా ఎగిరి క్యాచ్ ను పట్టుకున్నాడు.
రోహిత్ శర్మ క్యాచ్ పాతడంతో లిటన్ దాస్ తో పాటు భారత జట్టులో మిగతా ఆటగాళ్లు కూడా ఆశ్చర్యపోయారు.ప్రస్తుతం రోహిత్ శర్మ పట్టిన క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.
ఇక నాలుగో రోజు బ్యాటింగ్ విషయానికి వస్తే.రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ఆల్ అవుట్ అయ్యింది.74.2 ఓవర్లలో 233 parugulయూ చేసి కుప్పకూలింది.బంగ్లా ఇన్నింగ్స్ లో మొమినల్ హక్( Mominal Haq ) (107 నాటౌట్) సెంచరీ చేయగా., నజ్ముల్ శాంటో (31), షద్మాన్ ఇస్లామ్ (24), మెహిదీ హసన్ మిరాజ్ (20) పరుగులతో పర్వాలేదనిపించారు.
ఇక టీమిండియా మొదటి ఇన్నింగ్స్ ను దూకుడుగా మొదలు పెట్టింది.