దైవ కార్యాలు,పండుగలు,వ్రతాలు,నోములు చేసుకొనే సమయంలో తప్పనిసరిగా తాంబూలం ఉంటుంది.మనం చేసే పూజలో ధూప .
దీప .నైవేద్యాల తరవాత తప్పనిసరిగా తాంబూలం ఉండవలసిందే.అంతేకాక పూజ చేయించిన పురోహితునికి దక్షిణ ఇచ్చే సమయంలో కూడా తాంబూలం ఇవ్వటం పరిపాటి.
నోములు … వ్రతాల సమయంలోను ఇంటికి వచ్చిన ముత్తయిదువులకు వాయినాలతో పాటు తాంబూలం కూడా ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది.
ఇక వివాహం విషయానికి వస్తే పెళ్లి కుదుర్చుకునే సమయంలో ‘తాంబూలాలు’ మార్చుకునే సంప్రదాయం వుంది.కొన్ని సందర్భాలలో మొదట తాంబూలాన్ని అందుకోవటం గొప్ప ఘనతగా భావిస్తూ ఉంటారు.
తాంబూలానికి ఇంతటి ప్రాముఖ్యత ఇచ్చే ఆచారానికి వెనుక ఉన్న అర్ధం గురించి తెలుసుకుందాం.సాధారణంగా భోజనం తర్వాత వేసుకొనే తాంబూలంలో వక్కలు … సున్నం … పచ్చ కర్పూరం … జాజికాయ … లవంగాలు వంటివి కన్పిస్తాయి.
వీటి అన్నింటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
నోటి దుర్వాసనను పోగొట్టడమే కాకుండా, కడుపులోని క్రిములను సైతం ఇది నశింపజేస్తుంది.
నాలుకను శుభ్ర పరచడమే కాకుండా, దంత వ్యాధులను … గొంతుకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది.అయితే తాంబూలాన్ని మితంగా సేవిస్తేనే ఔషధంగా పనిచేస్తోందని శాస్త్రం చెప్పుతుంది.