తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) రాష్ట్రంలోని తిరుమల దేవస్థానానికి ప్రతి రోజు ఎంతో ఎన్నో వేల మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.అలాగే కొంతమంది వ్యక్తులు స్వామి వారికి కానుకలు చెల్లించి మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు.

 Crowd Of Devotees Increased In Tirumala.. Do You Know How Much Time It Takes Ven-TeluguStop.com

ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం ఎండాకాలం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది.అయితే ఈ వారాంతపు సెలవు దినాలు కావడంతో భక్తులు( Devotees ) వివిధ ప్రాంతాల నుండి వచ్చారు.

అలాగే కంపార్ట్మెంట్లు అన్నీ కూడా భక్తులతో నిండిపోయాయి.

ముఖ్యంగా చెప్పాలంటే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వలన కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలో నిలబడ్డారు.అయితే నిన్న స్వామి వారిని దర్శించేందుకు దాదాపు 87,762 మంది భక్తులు దర్శించుకున్నారు.ఇంకా చెప్పాలంటే 43,753 మంది భక్తులు తలనీలలు సమర్పించుకున్నారు.అయితే ఈ సారి భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా వచ్చిన హుండీ ఆదాయం దాదాపు 3.61 కోట్ల రూపాయలు వచ్చాయి.ఇంకా చెప్పాలంటే టోకెన్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా అంతర్జాతీయ యోగా దినోత్సవం( International Day of Yoga ) తిరుమల ఆస్థాన మండపంలో ఉదయం 6 నుండి 8 గంటల వరకు యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.అలాగే రెండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఆధ్వర్యంలో యోగా శిక్షకులు ఇందులో యోగాసనాలు, అలాగే వాటి వలన శారీరకంగా, మానసికంగా కలిగే ఉపయోగాలను తెలియజేస్తారని వెల్లడించారు.ఇంకా చెప్పాలంటే పోలీస్ ఫోర్స్ తో పాటు టిటిడి ఉద్యోగులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని టీటీడీ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube