మన దేశం వ్యాప్తంగా చాలామంది ప్రజలు ప్రతిరోజు దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు.మరి కొంతమంది అభిషేకాలు, మొక్కులు లాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలను చేస్తూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే మరి కొంతమంది భక్తులు వారికున్న కష్టాలు తొలగిపోవాలని దేవునికి వేడుకుంటూ ఉంటారు.అయితే మరి కొంతమంది ప్రశాంతమైన వాతావరణం కోసం దేవాలయాలకు వెళ్లి కాసేపు ప్రశాంతంగా ఉంటారు.
అయితే ఆలయానికి వెళ్ళినప్పుడు మనం ఎటువంటి నియమాలను పాటించాలో అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేయడం కంటే ముందు దేవుడికి మొక్కుకొని ఆ తర్వాత ప్రదక్షిణలు చేసి అనంతరం లోపలికి వెళ్ళాలి.
అలాగే ప్రదక్షణ చేసే సమయంలో తప్ప ఇంకెప్పుడూ దేవాలయ ధ్వజస్తంభం నీడను, ప్రాకారం నీడను కానీ దాటకూడదు.అలాగే చెడు ఆలోచనలు మనసులో ఉంచుకొని స్వామివారిని దర్శించుకోవడం అంత మంచిది కాదు.
దేవాలయంలో దేవుని ఎదుట అబద్ధాలు చెప్పడం పాపం.ఎందుకంటే దేవుడు సత్య స్వరూపుడు కాబట్టి దేవుని ముందు అబద్ధాలు అస్సలు చెప్పకూడదు.
అలాగే ఎప్పుడూ దేవాలయంలో దేవునికి వీపు భాగం చూపిస్తూ కూర్చోవడం కానీ, బయటికి రావడం కానీ చేయకూడదు.దేవాలయంలో ఎప్పుడు శివునికి నందికి మధ్య నడవకూడదు.

దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏదైనా పరిశుభ్రమైన వస్త్రం కానీ, లేదా శాలువా తో కానీ శరీరాన్ని కప్పుకోవాలి.గంజి బట్టలు ధరించి దేవుడి దర్శనానికి అస్సలు వెళ్ళకూడదు.దేవాలయంలో స్వార్థంతో కూడిన మాటలు, ప్రవర్తన అస్సలు చేయకూడదు.అక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రాణిని దైవంగా భావించాలి.
ఆలయంలో ఉండే యోచకులకు తోచిన సహాయం తప్పకుండా చేయాలి.ఇంటి నుండి తయారు చేసుకొని తీసుకెళ్లి ప్రసాదాన్ని అక్కడ ఉన్న భక్తులతో పాటు, అన్నం లేని పేదవారికి పెట్టడం కూడా మంచిదే.
దేవాలయానికి వెళ్లేటప్పుడు సంప్రదాయబద్ధమైన దుస్తులను ధరించి లోపలికి వెళ్లడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది.మహిళలు తప్పకుండా కుంకుమ బొట్టు ధరించి దేవరానికి వెళ్లాలి.
స్టిక్కర్లు పెట్టరాదు.