ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పురాతనమైన దేవాలయాలు( Ancient Temples ) ఉన్నాయి.ఈ దేవాలయాల అన్నిటికి ప్రతిరోజు భక్తులు వచ్చి పూజలు, హోమాలు, అభిషేకాలు చేస్తూనే ఉంటారు.
కొన్ని ఆలయాలు భక్తులు వెళ్లలేని ప్రదేశాలలో కూడా ఉన్నాయి.అలాంటి ఆలయాలలో కొన్ని ఆలయాలు పర్వత ప్రాంతాలలో, నదులకు సమీపంలో ప్రకృతి అందాల మధ్య ఉన్నాయి.
కానీ ఒక దేవాలయం మాత్రం సముద్రంలో ఉంది.ఇంతకీ సముద్రం మధ్యలో ఉండే ఆ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ దేవాలయం గుజరాత్ రాష్ట్రంలోని అరేబియా మహాసముద్ర తీరంలో కొలియాక్ గ్రామంలో ఉంది.పురాణాల ప్రకారం ఈ దేవాలయాన్ని పాండవులు మహాభారత యుద్ధం తర్వాత వారి దోషాలను, కలంకాలను తొలగించుకోవడానికి నిర్మించారని చరిత్రలో ఉంది.
అందుకే ఈ దేవాలయానికి నిష్కలంక్ దేవాలయం( Nishkalank Mahadev Temple ) అని పేరు రావడంతో పాటు శివుని నిష్కలంక్ మహదేవ్ గా ఇక్కడి ప్రజలు పూజిస్తారు.నిష్కలంక్ అంటే పాపాలను దూరం చేసేవాడు అని అర్థం కూడా ఉంది.

ఈ దేవాలయంలో భక్తులకు ఉదయం 11 గంటల నుండి దర్శనం మొదలవుతుంది.ఎందుకంటే ఉదయం 11 గంటల నుంచి సముద్ర అలలు కాస్త కాస్త జరుగుతూ మూడు కిలోమీటర్ల మీరు వెనక్కి తగ్గుతాయి.ఆ తర్వాతే దేవాలయం బయటకు కనిపిస్తుంది.ఆ సమయంలో భక్తులు వెళ్లి దర్శనం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.దేవాలయంలోని ఒక జెండాతో స్థూపం, ఐదు శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి.తిరిగి సాయంత్రం ఏడు గంటల వరకు సముద్రుడు ఆలయాన్ని ముంచి వేస్తాడు.
అర్ధరాత్రి దాటే సమయానికి ఆలయం పూర్తిగా సముద్రంలో మునిగి ఉంటుంది.పురాణాల ప్రకారం మహాభారత యుద్ధంలో పాండవులు దయాదులను చంపిన పాపం వారికి చుట్టుకుంటుందని కృష్ణుడిని శరణు కోరుతారు.
అప్పుడు పాండవులను కృష్ణుడు ఏం చెప్పాడంటే ఒక నల్లని ఆవుకు నల్లని జెండా( Black Flag ) కట్టి అది ఎంత దూరం వెళితే అంత దూరం వెళ్ళమని చెబుతాడు.

ఎక్కడైతే ఆవు, జెండా రంగులు తెల్లగా మారుతాయో అప్పుడు దయాధులను చంపిన పాపం నుంచి పాండవులు విముక్తులు అవుతారని ఉపదేశిస్తాడు.కృష్ణుని మాటలు విన్న పాండవులు( Pandavas ) చాలా రోజుల వరకు ఆవు వెంట నడుస్తూ వెళ్లి సరిగ్గా అరేబియా సముద్ర తీరం కొలియాక్ గ్రామం సమీపానికి చేరుకోగానే ఆవు, జెండా రెండు తెల్లగా మారిపోతాయి.దాంతో పాండవులు శివయ్యను జపిస్తూ ఘోర తపస్సు చేస్తారు.
అప్పుడు ఆ పరమశివుడు( Lord Shiva ) ఐదు స్వయంభు లింగాలుగా అవతరిస్తాడు.వెంటనే పాండవులు ఆ లింగాలకు అభిషేకాలు, పూజలు చేసి దేవాలయాన్ని నిర్మిస్తారు.