ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి ( Tirumala Tirupati Devasthanam )ప్రతి రోజు ఎన్నో లక్షల మంది దేశ నలమూలాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.మరి కొంత మంది భక్తులు స్వామి వారికి పూజలు, అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు.
ఇంకా దేశంలో చాలా మంది స్వామి వారి భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.తిరుమలలో ఇలా ప్రతి రోజు వచ్చే భక్తులు స్వామి వారికి హుండీలో కానుకలను( Gifts in hundi ) సమర్పిస్తూ ఉంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల శ్రీవారి దేవాలయం తో పాటు ఇతర అనుబంధాలయాలకు భక్తులు కానుకలుగా సమర్పించిన వస్త్రాలను ఏప్రిల్ 10 నుంచి ఈ- వేలం వెయ్యనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య అధికారులు తెలిపారు.వేలంలో బంగారు వాకిలి పరదాలు, శ్రీవారి గొడుగులు, ధోతీలు, ఉత్తరియాలు వివిధ రకాల చీరలు,శాలువాలు,టర్కీ టవర్లు, దుప్పట్లు, కర్టన్లు ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయని వెల్లడించారు.పూర్తి వివరాలకు 0877-2264429 నెంబర్లను సంప్రదించాలని తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్ సైట్ లో సందర్శించాలని సూచించారు.
అంతే కాకుండా ఈ రోజు ఏప్రిల్ నెల ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేయనున్నారు.ఏప్రిల్ నెలకూ సంబంధించి తిరుమల తిరుపతి ప్రవేశ దర్శనం టికెట్లు కోటాను సోమవారం రోజు ఉదయం 11 గంటలకు సమయంలో తమ వెబ్ సైట్ లో అందుబాటులో వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధికారిక ప్రకటన చేసింది.ఆన్ లైన్ టికెట్లు ( Online tickets)బుక్ చేసుకోవాలని సూచించింది.తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ప్రత్యేక దర్శనం టికెట్ల ధర రూ.300 రూపాయలు ఉంటుందని వెల్లడించింది.ముందు జాగ్రత్తగా ఆన్ లైన్ టికెట్లు బుక్ చేసుకుంటే శ్రీవారి దర్శనం జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి వెల్లడించింది.