త‌ల‌లో చుండ్రు క‌నిపించ‌కూడ‌దంటే ఈ టిప్స్ ను పాటించండి!

చాలా మందిని చిరాకు పెట్టే సమస్యల్లో చుండ్రు ఒకటి.తల మీద చర్మం పొడిబారడం, దానికి సూక్ష్మ క్రిములు తోడవడం చుండ్రు సమస్యకు దారితీస్తాయి.

 Home Remedies To Cure Dandruff Naturally! Dandruff, Home Remedies, Latest News,-TeluguStop.com

చుండ్రు కారణంగా తలలో దురద విపరీతంగా ఉంటుంది.పైగా తల స్నానం చేసినప్పుడు భుజాలపై రాలే తెల్ల‌టి పొట్టు వల్ల ఎంత ఇరిటేష‌న్ కు గురవుతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అయితే చుండ్రుకు శాశ్వతంగా గుడ్ బై చెప్పాలి అనుకునే వారికి ఇప్పుడు చెప్పబోయే టిప్స్ బాగా సహాయపడతాయి.తలలో చుండ్రు కనిపించకూడదు అంటే మొదట మీరు కరెక్ట్ షాంపూ ను ఎంచుకోవాలి.

మీరు ఎంచుకునే షాంపూ తల మీద చర్మానికి ఎక్కువ తేమను అందించేవిగా ఉండాలి.అలాగే సూక్ష్మ క్రిములతో పోరాడగలగాలి.

కాబట్టి క్లినికల్ షాంపూను ఎంచుకోవాలి.కండిషనర్ కూడా యాంటీ డాండ్రఫ్ దే వాడాలి.

Telugu Dandruff, Dandruffremoval, Care, Care Tips, Healthy Scalp, Latest-Telugu

చుండ్రు సమస్య( Dandruff )తో బాధపడుతున్న వారు వారానికి కచ్చితంగా మూడుసార్లు తలస్నానం చేయాలి.త‌ర‌చూ గోరు వెచ్చ‌ని కొబ్బ‌రి నూనెతో మాడును మ‌ర్ద‌నా చేసుకోవాలి.చాలా మంది వేడి వేడి నీటితో తల స్నానం చేస్తూ ఉంటారు.ఇది తల మీద చర్మం పై తేమను కోల్పోయేలా చేస్తుంది.అందువల్ల హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి.

Telugu Dandruff, Dandruffremoval, Care, Care Tips, Healthy Scalp, Latest-Telugu

అలాగే ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కా చుండ్రును నివారించడానికి చాలా బాగా సహాయపడుతుంది.అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు వేపాకు పొడి, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ), రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉప‌యోగించి తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే చుండ్రు మీ వంక కూడా చూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube