ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలు ప్రతిరోజు ఉదయం లేవగానే టీ తాగడం( Tea ) అలవాటు చేసుకున్నారు.పని ఒత్తిడి ఉన్నప్పుడు, నిరసనగా అనిపించినప్పుడు, స్నేహితులతో సరదాగా ఇలా రోజులో రెండు నుంచి మూడుసార్లు టీ తాగడం సాధారణ విషయంగా మారిపోయింది.
అయితే చాలామంది టీ తాగే ముందు నీళ్లు తాగుతూ ఉంటారు.మరి కొందరు టీ తాగిన తర్వాత నీళ్లు తాగుతూ ఉంటారు.
కానీ ఇలా టీ తాగడానికి ముందు తాగిన తర్వాత నీళ్లు తాగడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

నిజంగా టీ తాగడానికి ముందు తర్వాత నీళ్లు తీసుకోకూడదా, తాగితే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.టీ తాగడానికి ముందు తాగిన తర్వాత నీళ్లు తాగే అలవాటు చాలామందికి ఉంటుంది.ఇలా చేయడం తప్పని, ప్రమాదం అని కూడా వైద్యులు చెబుతున్నారు.
కానీ టీ తాగడానికి ముందు నీరు తాగడం ( Water )మంచిదే.టి పి హెచ్ విలువ ఆరు ఇది తటస్థమైనదే.
అయినా ఇందులో ఉన్న ఆమ్లా గుణం కారణంగా ప్రేగులు ప్రభావానికి లోనవుతాయి.కానీ టీ తాగడానికి ముందు నీరు తాగడం వల్ల ప్రేగులను నీరు కప్పి ఉంచుతుంది.

దీనివల్ల టీలో ఉన్న ఆమ్ల ప్రభావం పేగుల మీద ప్రభావం చూపదు.ముఖ్యంగా చెప్పాలంటే సాధారణ నీటి కంటే గోరువెచ్చని నీరు త్రాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.అలాగే టీ తాగడానికి ముందు నీరు తాగడం వల్ల ఎసిడిటీ, డిహైడ్రేషన్( Acidity ) సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.కాబట్టి టీ తాగే ముందు నీళ్లు తాగడం ఏ రకంగా చూసినా మంచిదే.

అయినా నీళ్లు తాగిన వెంటనే టీ తాగకూడదు.నీళ్లు తాగిన 10 నుంచి 15 నిమిషాల తర్వాత మాత్రమే టీ తాగాలి.ఇంకా చెప్పాలంటే టీ తాగిన తర్వాత నీళ్లు తాగే అలవాటు ఉంటే మాత్రం ఆరోగ్యం పై చాలా చెడు ప్రభావం పడుతుంది.ఇది అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదు.
టీ తర్వాత నీళ్లు మాత్రమే కాదు వేరే ఇతర ద్రవపదార్థాలు ఏవి తీసుకోకూడదు.