రోజు ఈ పొడిని పాల‌ల్లో క‌లిపి తీసుకుంటే పొట్ట కొవ్వు ప‌రార్ అవుతుంది!

ఆహారపు అలవాట్లు, గంటలు తరబడి ఒకే చోట కూర్చుని ఉండటం, ఒత్తిడి, మద్యపానం, ప్రెగ్నెన్సీ తదితర కారణాల వల్ల నాజూగ్గా ఉండాల్సిన పొట్ట బాన పొట్టలా తయారవుతుంటుంది.దీంతో పెరిగిన పొట్టను కరిగించుకోవడం కోసం నానా పాట్లు పడుతుంటారు.

 Taking This Powder With Milk Daily Will Reduce Belly Fat Details! Belly Fat, Bel-TeluguStop.com

మీరు ఈ జాబితాలో ఉన్నారా? అయితే డోంట్ వర్రీ.ఇప్పుడు చెప్పబోయే పొడిని ప్రతిరోజు పాలల్లో కలిపి కనుక తీసుకుంటే మీ పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు కేవలం కొద్ది రోజుల్లోనే పరార్ అవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం బాన పొట్టను నివారించే ఆ పొడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు అవిసె గింజలను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి.

ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు బాదం పప్పు, అర కప్పు ఎండు కొబ్బరి పొడి, అరకప్పు నువ్వులను విడివిడిగా వేయించుకోవాలి.చివర్లో రెండు దాల్చిన చెక్క ను సైతం వేయించుకొని పెట్టుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న బాదం పప్పు, అవిసె గింజలు, నువ్వులు, ఎండు కొబ్బరి పొడి, దాల్చిన చెక్క వేసుకుని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ పొడిలో ఒక కప్పు తాటి బెల్లం పొడిని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి.

Telugu Belly Fat, Bellyfat, Belly Fat Tips, Tips, Latest-Telugu Health

అంతే పొట్ట కొవ్వును తరిమికొట్టే మ్యాజికల్ పొడి సిద్ధం అయినట్టే.ఈ పొడిని ఒక డబ్బాలో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ పొడిని వ‌న్ టేబుల్‌ స్పూన్ చొప్పున‌ గ్లాసు ఫ్యాట్ లెస్ గోరువెచ్చని పాలలో మిక్స్ చేసి సేవించాలి.ఇలా ప్రతిరోజు కనుక చేస్తే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.

దాంతో మీ బాన పొట్ట‌ కొద్ది రోజుల్లోనే మాయం అవుతుంది.అంతేకాదు పైన చెప్పిన పొడిని పాలల్లో కలిపి ప్రతిరోజూ తీసుకుంటే ఎముకల బలహీనత దూరం అవుతుంది.

జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.రక్తహీనత దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.

మరియు నీరసంచ‌ అలసటచ‌ ఒత్తిడి వంటి సమస్యల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube