ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ సినిమాలు వెంట వెంటనే చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తుంది.తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ని అలరిస్తూ వస్తున్న నిధి అగర్వాల్ లేటెస్ట్ గా తన ఇన్ స్టాగ్రాం లో మెసేజ్ తో అందరికి షాక్ ఇచ్చింది.
ఇంతకీ నిధి అగర్వాల్ ఏం చెబుతుంది అంటే వస్తువులను వాడుకోండి మనుషులను కాదు అంటూ ఒక ఇంగ్లీష్ లో కొటేషన్ పెట్టింది.అసలు నిధి అగర్వాల్ ఎందుకు ఈ కొటేషన్ షేర్ చేసిందో తెలియాల్సి ఉంది.
తెలుగులో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్న న్నిధి అగర్వాల్ ఆ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంది.
అయితే తమిళంలో మాత్రం అమ్మడు వరుస సినిమాలతో దూసుకెళ్తుంది.
అమ్మడికి తమిళంలో మంచి క్రేజ్ ఏర్పడిందని చెప్పొచ్చు.మరి ఎందుకు నిధి అంత హర్ట్ అయ్యింది అన్నది బయటకు రావాల్సి ఉంది.
ఒకవేళ నిధికి కూడా పర్సనల్ గా అలాంటి ఎక్స్ పీరియన్స్ ఏమైనా అయ్యిందా అని అనుకుంటున్నారు.ఏది ఏమైనా నిధి తన స్టేటస్ లో పెట్టుకున్న ఆ మెసేజ్ గురించి ఇప్పుడు అందరు చర్చించుకుంటున్నారు.
మెసేజ్ ల సంగతి అలా ఉంచితే నిధి తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లో హాట్ షోస్ తో అదరగొడుతుంది.







