టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు నిఖిల్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్టు ఫ్లాపాలతో సంబంధం లేకుండా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి నిఖిల్ కార్తికేయ 2 సినిమా ద్వారా సంచలనం సృష్టించారు.
ఈ సినిమా దక్షిణ భారతదేశంలోనే కాకుండా ఉత్తర భారత దేశంలో కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.ఇకపోతే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో కార్తికేయ 3 కూడా చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నారు.
ఇకపోతే తాజాగా ఒక ఆంగ్ల మీడియాతో మాట్లాడినటువంటి నిఖిల్ సినిమాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ తాను కార్తికేయ సినిమా చేసిన తర్వాత ఎక్కడికి వెళ్లినా చాలామంది ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం లేదా అని అడుగుతున్నారు.
ఇలా ప్రేక్షకులు అడుగుతున్నారు అంటే ఈ సినిమా నుంచి వాళ్ళు ఇంకా ఏదో కోరుకుంటున్నారని సీక్వెల్ చిత్రాన్ని చేసామని తెలిపారు.ఇకపోతే కార్తికేయ 2 తీసిన తర్వాత కార్తికేయ 3 గురించి కూడా అడుగుతున్నారు.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు.ఈ సినిమా నేను కనుక చేయకపోతే ఎవరు వదిలిన మా అమ్మ మాత్రం నన్ను అసలు వదిలిపెట్టదని ఈయన తెలిపారు.అయితే ఇదివరకు ఇంటర్వ్యూలో ఈయన ఆస్కార్ అవార్డుల గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే ఈ విషయం గురించి ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ.ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డ్ మాత్రమే కాదు.మాకు జాతీయ అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కూడా ఉన్నాయని తెలిపారు.
అయితే ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు వస్తే బాగుంటుందనీ, ప్రతి ఒక్క సినిమాను కూడా ఆస్కార్ కోసం చేయరని,మాకు అవార్డుల కన్నా ప్రేక్షకుల ప్రేమాభిమానాలు ముఖ్యమంటూ ఈ సందర్భంగా ఈయన మరోసారి అవార్డుల గురించి కామెంట్స్ చేశారు.







