టాలీవుడ్ రౌడీ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. వరుస ప్లాప్స్ వచ్చినా ఈయన క్రేజ్ తగ్గలేదు.
ఇక ఇటీవలే లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.లైగర్ కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది.
ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది.కానీ డిజాస్టర్ అవ్వడంతో రౌడీ కొన్నాళ్ల పాటు సైలెంట్ అయ్యాడు.
ఇక ప్రెజెంట్ విజయ్ జై జవాన్ కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు.
ప్రముఖ నేషనల్ ఛానెల్ ప్రత్యేకంగా చేపట్టిన జై జవాన్ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ దేశ సరిహద్దులో జవాన్లను కలిసాడు.
బారాముల్లా లోని నియంత్రణ రేఖకు దగ్గరలో ఉన్న యూరీ సెక్టార్ ను సందర్శించి అక్కడ విధి నిర్వహణలో ఉన్న జవాన్లను కలిసి వారితో ఫోటోలు దిగారు.ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి కాస్త నెట్టింట వైరల్ అయ్యాయి.
విజయ్ జవాన్లతో పాటు ఆర్మీ జాకెట్ వేసుకుని తుపాకి పట్టుకుని దిగిన ఫోటో వైరల్ అయ్యింది.
ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే.
లైగర్ సినిమా రిలీజ్ కంటే ముందే విజయ్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమణ సినిమాను ప్రకటించారు.కానీ ఈ సినిమా లైగర్ ప్లాప్ కారణంగా ఆగిపోయింది.

ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగిపోవడంతో ఇప్పుడు విజయ్ చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది.
శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు విజయ్.ఈ సినిమాలో విజయ్ కు జోడీగా సమంత హీరోయిన్ గా నటిస్తుంది.కాశ్మీర్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథగా ఈ సినిమాను డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే సగానికి పైగానే షూటింగ్ పూర్తి చేసిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హీషమ్ సంగీతం అందిస్తున్నారు.
మరి ఈ లవ్ స్టోరీ ఈ జోడీకి ఎలాంటి హిట్ అందిస్తుందో వేచి చూడాల్సిందే.







