1.టీటీడీ ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వివాహాలు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7వ తేదీన ఉచిత సామూహిక వివాహాలు నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు.
2.సీఏఏ ను కేరళలో అమలుచేయం
వివాదాస్పద పౌరసత్వ చట్టాన్ని కేరళలో అమలు చేయబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.
3.కాంట్రాక్టర్ల సమస్యపై చంద్రబాబు కామెంట్
ఆంధ్రప్రదేశ్లో బిల్లులు చెల్లింపుపై వైసీపీ ప్రభుత్వం పాటిస్తున్న విధానంతో కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారని, తద్వారా ప్రభుత్వ సంస్థలు, సిబ్బంది, ఉద్యోగుల పై తీవ్ర ప్రభావం చూపుతుందని టిడిపి అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.
4.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 4,041 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
5.ఆర్ ఎఫ్ సీ ఎల్ లో ఉద్యోగాల భర్తీ
భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ కు చెందిన నోయిడాలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది.
6.రాహుల్ గాంధీకి రెండోసారి సమయంలో ఇచ్చిన ఈడి
కాంగ్రెస్ లీడర్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( ఈడి ) రెండోసారి సమన్లు జారీ చేసింది.
7.ఇండియాలో అతిపెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మించనున్న టాటా గ్రూప్
ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలోని జెవార్ లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం టాటా గ్రూప్ నిర్మించనుంది.
8.రజినీకాంత్ ను కలిసిన హీరో కార్తీ
ఇటీవల అనారోగ్యానికి గురైన సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో కార్తీ, ప్రముఖ నటుడు నాజర్ వెళ్లి కలిశారు.
9.వైసీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య పై కేసు నమోదు
వైసీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య హైదరాబాదులో పోలీసు కేసు నమోదయ్యింది.రౌడీలు గుండాల తో ఆర్.కృష్ణయ్య బెదిరిస్తున్నారని రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
10.Covid నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా
విమానాశ్రయాలు విమానాల్లో ప్రయాణికులు మాస్కులు ఖచ్చితంగా ధరించాలనే నిబంధనలు అమలు చేయాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.కోవిస్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా విధించాలని ఢిల్లీ కోర్టు తెలిపింది.
11.మంత్రి సబిత ఇంద్రారెడ్డి పై జగ్గారెడ్డి ఆగ్రహం
మంత్రి సబిత ఇంద్రారెడ్డి పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.నాలుగు రోజుల క్రితం ప్రజాసమస్యలు చెప్పేందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ని అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదని సీఎం కేసీఆర్ కూడా ఇవ్వడం లేదని జగ్గరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
12. అమిత్షాతో ముగిసిన జగన్ బేటీ
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈరోజు ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు.
13.రాయపూర్ ఎయిమ్స్ లో ఉద్యోగాలు
రాయపూర్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( ఎయిమ్స్ ) లో 34 ఖాళీల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది.
14.సైకిల్ ర్యాలీ ప్రారంభించిన మంత్రి
ప్రపంచ సైకిల్ దినోత్సవం పురస్కరించుకొని ఎన్.సి.సీ , నిర్మల్ సైకిల్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీని తెలంగాణ అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
15.6న గురుకుల కాలేజీ లో ప్రవేశ పరీక్ష
తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికి జూన్ 6 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలంగాణ గురుకుల విద్యాలయల సంస్థ కార్యదర్శి సిహెచ్ అరుణ్ కుమార్ తెలిపారు.
16.గవర్నర్ ను కలిసిన గ్రూప్ అభ్యర్థులు
ఏపీలో గ్రూప్ వన్ అభ్యర్థులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు.అర్హతలేని వారిని అడ్డదారుల్లో ఎంపిక చేస్తున్నారని, దీనిపై సిబిఐతో విచారణ చేయించి తమకు న్యాయం చేయాలని గవర్నర్ ను గ్రూప్-1 అభ్యర్థులు కోరారు.
17.అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్ లో గ్యాస్ లీక్
అనకాపల్లి జిల్లా లోని అచ్చుతాపురం బ్రాండిక్స్ లో లో గ్యాస్ లీకయింది. సీడ్స్ యూనిట్లో ఒక్కసారిగా ఘాటైన వాయువు లీకైంది దీంతో వాంతుల; ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
18 నక్కా ఆనందబాబు హౌస్ అరెస్ట్
టిడిపి నేత మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.ఆయన టీటీడీ కార్యాలయం వద్దకు వెళ్ళకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.
19.విద్యార్థి సంఘాల దీక్ష భగ్నం
రాయలసీమ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు చేపట్టిన 48 గంటల దీక్ష ను పోలీసులు భగ్నం చేశారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -48,100 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52, 470
.