Writer DV Narasaraju: అతను కలం పడితే ఏ సినిమా అయినా బ్లాక్‌బస్టర్ హిట్టే.. అందుకే మహామహులకు ఫేవరెట్..

దాట్ల వెంకట నరసరాజు ఈ తరం టాలీవుడ్ ప్రేక్షకులకు తెలియకపోవచ్చు కానీ అప్పట్లో దిగ్గజ సినిమా ప్రముఖులే అతని వద్దకు క్యూ కట్టేవారు.అతను కలం పడితే ఏ మూవీ అయినా సూపర్ డూపర్ హిట్ కావాల్సిందే.

 Tollywood Famous Writer D V Narasaraju-TeluguStop.com

అంతటి టాలెంట్ అతని సొంతం.జులై 15న డి.

వి నరసరాజు( DV Narasaraju ) జయంతి.ఈ సందర్భంగా ఈ టాలెంటెడ్ రైటర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పాతాళభైరవి, మాయాబజార్ వంటి సినిమాలు తెరకెక్కించిన దిగ్గజ దర్శకుడు కె.వి.రెడ్డి డి.వి నరసరాజును సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.పెద్ద మనుషులు( Pedda Manushulu Movie ) అనే మూవీకి రచయితగా పింగళిని కె.వి రెడ్డి తీసుకోవాలనుకున్నారు.కానీ విజయా ప్రొడక్షన్స్‌ సంస్థలో జీతానికి కమిట్ కావడం వల్ల పింగళి ఆ ప్రొడక్షన్ రూల్స్ ని అతిక్రమించలేక కె.వి.రెడ్డి( KV Reddy ) సినిమాకి కథ రాయలేకపోయాడు.దాంతో పెద్ద మనుషులు సినిమాకి డి.వి నరసరాజును రచయితగా కె.వి.రెడ్డి ఎంపిక చేసుకున్నారు.

Telugu Athreya, Saraju, Kv Reddy, Dv Saraju, Gundamma Katha, Pedda Manushulu, Ra

ఆ విధంగా డి.వి నరసరాజు తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు.ఈ సినిమాకు కథ అందించిన తర్వాత దొంగ రాముడు, శోభ వంటి సినిమాలకు అదిరిపోయే డైలాగులు అందించాడు.

అనంతరం రాజమకుటం సినిమాకి డైలాగులతో పాటు కథ కూడా ఆఫర్ చేశాడు.వీటితో అతనికి బాగా గుర్తింపు దక్కింది.రెండు మూడు ఏళ్ల తర్వాత బ్లాక్ బాస్టర్ హిట్ గుండమ్మ కథకు( Gundamma Katha ) తనదైన శైలిలో డైలాగులు అందించి అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నాడు.

Telugu Athreya, Saraju, Kv Reddy, Dv Saraju, Gundamma Katha, Pedda Manushulu, Ra

ముత్యాలంపాడు గ్రామంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తొలి వ్యక్తిగా దాట్ల వెంకట నరసరాజు చరిత్ర సృష్టించారు.వీరిది అత్యంత ధనిక కుటుంబం కావడంతోపాటు బంధువుల సపోర్టు ఫుల్ గా ఉండటంవల్ల నాటక రచయిత కావాలని నరసరాజు అనుకున్నాడు.చాలా క్రియేటివిటీతో పాటు డబ్బులు దండుగా ఉండటంతో ఉద్యోగాలు చేయాలనే ఆలోచన చేయకుండా నాటక రచయితగా కెరీర్ ప్రారంభించాడు.

Telugu Athreya, Saraju, Kv Reddy, Dv Saraju, Gundamma Katha, Pedda Manushulu, Ra

అంతర్వాణి, నాటకం లాంటి సూపర్ హిట్ నాటకాలకు డివి నరసరాజు కథలు అందించి అప్పట్లో బాగా ఫేమస్ అయ్యాడు.ఆ డ్రామాలు చూసిన తర్వాతే కె.వి.రెడ్డి తన పెద్ద మనుషులు సినిమాకి సెలెక్ట్ చేసుకున్నాడు.ఆ నమ్మకాన్ని నరసరాజు నిలబెట్టుకున్నాడు.తర్వాత చాలా సూపర్ హిట్ సినిమాల్లో డైలాగులు అద్భుతంగా రాశాడు.అతని డైలాగులు తూటాల్లా పేలుతుంటే సినిమా థియేటర్లలో ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ హోరెత్తించేవారు.

Telugu Athreya, Saraju, Kv Reddy, Dv Saraju, Gundamma Katha, Pedda Manushulu, Ra

నరసరాజు ఆత్రేయ లాగా కాకుండా వెంటనే రచనలను పూర్తి చేసి ఇచ్చేవాడు.చాలా సందర్భాల్లో ఆత్రేయ ఒప్పుకున్న సినిమాలకు నరసరాజు కథలను అందించాడు.ఎందుకంటే ఆత్రేయ చాలా ఆలస్యం చేస్తూ సినిమాలను త్వరగా పట్టాలెక్కించేవాడు కాదు.

అలాంటి వాటిలో బడిపంతులు సినిమా కూడా ఉంది.ఎన్టీఆర్ ( Sr NTR ) నరసరాజు ప్రతిభను గుర్తించిన తర్వాత అతనిపై ప్రత్యేక అభిమానం పెంచుకున్నాడు.

తాను డైరెక్ట్ చేసిన చాలా సాంఘిక చిత్రాలకు నరసరాజునే రైటర్ గా ఎంపిక చేసుకున్నాడు.

ఒక సినిమా కథ చర్చల సమయంలో నరసరాజు ఆడవారి గురించి చెప్పిన మాటలు విని ఎన్టీఆర్ ఆశ్చర్యపోయాడట.

అంతేకాదు, ఆ తర్వాత ఎన్టీఆర్ వాళ్ల భార్య బసవతారకంతో, ఆడపిల్లలతో ప్రవర్తించే తీరులో చాలా మార్పులు వచ్చాయని స్వయంగా నరసరాజే చెప్పుకొచ్చాడు.నరసరాజు భక్త ప్రహ్లాద సినిమాకి కూడా అద్భుతంగా డైలాగులను రాసి తన సత్తా ఏంటో చూపించాడు.

ఇకపోతే నరసరాజు టాలెంట్ ని చూసి ఎస్.వి.రంగారావు, బి.ఎన్.రెడ్డి వంటి మహామహులకు కూడా ఫేవరెట్ అయిపోయాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube