గారపట్టిన పసుపు దంతాలను ముత్యాల్లా మెరిపించే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!

చ‌క్క‌టి చిరు న‌వ్వుకు తెల్ల‌టి దంతాలు మ‌రింత ప్రాణం పోస్తాయి.కానీ, చాలా మంది గార‌ప‌ట్టిన ప‌సుపు దంతాల‌తో బాధ ప‌డుతూ మ‌న‌సారా న‌వ్వ‌డానికే భ‌య‌ప‌డుతుంటారు.

 Effective Home Remedy For Teeth Whitening Effective Home Remedy , Teeth Whiteni-TeluguStop.com

క‌నీసం నాలుగురితో నోరు తెరిచి మాట్లాడాల‌న్నా వెన‌క‌డుగు వేస్తుంటారు.కాఫీ, టీ, కూల్ డ్రింక్స్‌ను అధికంగా తీసుకోవ‌డం, స్మోకింగ్‌, ఆహార‌పు అల‌వాట్లు, దంత సంర‌క్ష‌ణ లేక పోవ‌డం, చ‌క్కెర‌ను ప‌రిమితికి మించి వాడ‌టం వంటి రక‌ ర‌కాల కార‌ణాల వ‌ల్ల దంతాలు పసుపు రంగులోకి మారి పోతుంటాయి.

కార‌ణం ఏదైనా దంతాలు ప‌సుపు రంగులో ఉంటే చూసేందుకు చాలా అస‌హ్యంగా క‌నిపిస్తాయి.అందుకే ప‌సుపు దంతాల‌ను వ‌దిలించు కునేందుకు ర‌క‌ ర‌కాల టూత్ పేస్ట్‌ల‌ను వాడు తుంటారు.

అయినా ఫ‌లితం లేకుంటే ఏం చేయాలో అర్థం గాక స‌త‌ మ‌తం అయి పోతుంటాయి.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని ట్రై చేస్తే గ‌నుక గార పట్టిన పసుపు దంతాలను ముత్యాల్లా మెరిపించు కోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ ట‌మాటో జ్యూస్‌, వ‌న్ టేబుల్ స్పూన్ క్యారెట్ జ్యూస్‌, రెండు టేబుల్ స్పూన్ల టూత్ పేస్ట్‌, వ‌న్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, వ‌న్ టేబుల్ స్పూన్ పుదీనా జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని దంతాల‌పై అప్లై చేసి రెండంటే రెండు నిమిషాల పాటు స్మూత్‌గా బ్రెష్‌తో తోముకోవాలి.

ఆ త‌ర్వాత వాట‌ర్‌తో శుభ్రంగా దంతాల‌ను క్లీన్ చేసుకోవాలి.

ఈ రెమెడీని వారంలో మూడు సార్లు ట్రై చేస్తే గ‌నుక గార పట్టిన పసుపు దంతాలు తెల్ల‌టి ముత్త్యాల్లా మెరిసి పోవ‌డం ఖాయం.కాబ‌ట్టి, ఖ‌చ్చితంగా ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీని ట్రై చేయ‌డానికి ప్ర‌య‌త్నించండి.

Effective Home Remedy For Teeth Whitening! Effective Home Remedy, Teeth Whitening, Latest News, Yellow Teeth, Dental Health, Teeth Whitening Tips - Telugu Latest, Teeth, Teeth Tips, Yellow Teeth #Shorts

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube