2024 సార్వత్రిక ఎన్నికలు( 2024 Election ) దగ్గర పడుతున్న కొద్ది పొత్తు అంశాలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి.ఒకవైపు బీజేపీని గద్దె దించేందుకు విపక్షాలన్నీ ఒక్కటవుతుంటే.
మరోవైపు బీజేపీ తమతో కలిసే పార్టీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.ఈ నేపథ్యం లో ఎన్డీయేతో చేతులు కలిపేందుకు సిద్దంగా ఉన్న పార్టీలపై బీజేపీ( BJP ) దృష్టి సారించింది.
ఏపీలో ఇప్పటికే టీడీపీ ఎన్డీయే వైపు చూస్తోంది.ఇక కర్నాటక విషయానికొస్తే గతంలో ఎన్డీయేలో భాగమై ఉన్న జెడిఎస్ పార్టీ.
అనూహ్యంగా బయటకు వచ్చి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ గానే బరిలోకి దిగింది.

అయితే కర్నాటక ఎన్నికల ముందు కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలకు సమదూరం పాటించిన జెడిఎస్ హంగ్ ఏర్పడితే ఏ పార్టీతోనైనా కలవడానికి సిద్దమే అనే సంకేతాలు ఇచ్చింది.కానీ ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.జెడిఎస్ మరియు బీజేపీ అంచనాలను తలకిందులు చేసింది.
అయితే ఆ టైమ్ లో జెడిఎస్( JDS ) మరియు బీజేపీ మద్య పొత్తు కుదిరే అవకాశం ఉందనే వార్తలు గట్టిగానే వినిపించాయి.కానీ అటు బీజేపీ గాని ఇటు జెడిఎస్ పార్టీ నేతలు గాని పొత్తు విషయంలో ఎవరు క్లారిటీ ఇవ్వలేదు.
ఇక తాజా పరిణామాలు చూస్తుమే ఈ రెండు పార్టీలు ఒకటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ నెల 18న ఎన్డీయే మిత్రపక్షాలతో సమావేశం ఏర్పాటు చేయనుంది బీజేపీ. ఈ సమావేశానికి కర్నాటక నుంచి జెడిఎస్ పార్టీకి ఆహ్వానం అందించనే వార్తలు పోలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.అంతే కాకుండా ఈ సమావేశంలో పొత్తు పై క్లారిటి వచ్చే అవకాశం ఉందని జెడిఎస్ పార్టీ నేతలు చెబుతున్నారు.
దీంతో సార్వత్రిక ఎన్నికలకు ఎన్డీయే తో కలిసి పోటీ చేయాలని జెడిఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.మరి అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూన్న స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయిన జెడిఎస్ పార్టీ.
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఎలాంటి ఫలితాలను రాబడుతుందో చూడాలి.







