సినిమా ఇండస్ట్రీకి వచ్చి నిలదొక్కుకొని ఎదగడం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే చాలామంది ఇక్కడ ఈజీగా ఏదగ్గొచ్చు అని వచ్చి , ఇక్కడ మనం ఎదగడం అనేది అంత ఈజీ కాదు అని తెలుసుకుని వాళ్లంతట వాళ్లే ఇండస్ట్రీ నుంచి వెళ్లి పోయి వేరే పనులు చేసుకుంటున్న నటులు చాలామంది ఉన్నారు.అలాగని ఇక్కడ ఎదగడం కష్టమని కూడా చెప్పలేము, కానీ అనుక్షణం అదే తపన అదే దీక్ష గా ఉన్న చాలా మంది ఇండస్ట్రీలో ఎదిగి వాళ్ళకంటూ ఒక స్థాయిని సంపాదించుకొని ప్రస్తుతం చాలా విలువైన నటులుగా గుర్తింపును పొందారు.
అలాంటి వారిలో తనికెళ్ల భరణి గారు ఒకరు.
ఆయన ఇంట్లో నుంచి వచ్చి రవీంద్రభారతిలో జరిగే నాటకాల్లో పాల్గొని నాటకాలు రాసేవారు అక్కడ తరచుగా నాటకాలు వేసే రాళ్లపల్లి గారి దృష్టిని ఆకర్షించి ఆయనతో పాటు వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చాలా నాటకాలు రాస్తూ రాళ్ళపల్లి గారి ఆధ్వర్యంలో నాటకాలు వేస్తూ తనకంటూ నాటకాల్లో మంచి గుర్తింపును సాధించుకున్నారు.
ఇటువైపు తనికెళ్ల భరణి నాటకం రాశాడు అంటే అటువైపు ఎల్బీ శ్రీరామ్ గారు నాటకాలు రాస్తూ ఆయన కూడా ప్రదర్శనలు ఇచ్చేవారు వీరిద్దరి మధ్య ఎప్పుడు నాటకాల్లో మంచి పోటీ ఉండేది.అలాంటి పోటీ వాతావరణం నుంచి ఇద్దరూ కూడా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి గుర్తింపు పొందిన నటులుగా ఎదిగారు.
అయితే ఆయన ఇంకెన్ని రోజులు ఇలా నాటకాలు వేస్తాము అని అనుకొని నాటకాలు మానేసి సినిమా అవకాశాల కోసం ఎదురు చూశారు.అలాంటి సమయంలో ఆయన 13 రోజుల పాటు పస్తులు కూడా ఉన్నారు.
![-Telugu Stop Exclusive Top Stories -Telugu Stop Exclusive Top Stories](https://telugustop.com/wp-content/uploads/2021/03/Actor-tanikella-bharani-movie-offers.jpg)
ఆ తర్వాత సుమన్ హీరోగా వస్తున్న కంచు కవచం సినిమా కి రైటర్ గా అవకాశం వచ్చింది దాంతో మీరు మా సినిమాకి రైటర్ గా చేస్తారా అని దర్శకుడు అడగడంతో చేస్తాను కానీ ప్రస్తుతం నాకు అన్నం పెట్టండి అని చెప్పాడంట.అలా భోజనం చేసిన తర్వాత ఆ సినిమా గురించి తెలుసుకొని ఆ సినిమాకి రైటర్ గా వ్యవహరించాడు.సినిమా మంచి విజయాన్ని సాధించడంతో వెనుతిరిగి చూడకుండా మంచి అవకాశాలను దక్కించుకున్నాడు.తెలుగులో మంచి దర్శకుడిగా గుర్తింపుపొందిన వంశీ అతన్ని పిలిచి ఆయన చేత లేడీస్ టైలర్, కనక మహాలక్ష్మి డాన్స్ ట్యూప్, చెట్టు కింద ప్లీడర్ లాంటి సినిమాలకి రైటర్ గా చేయించుకున్నాడు అలా ఆ సినిమాలకు రైటర్ గా చేసి మంచి గుర్తింపును సాధించారు తనికెళ్ల భరణి.
ఆ తర్వాత విలక్షణ దర్శకుడు అయిన రాంగోపాల్ వర్మ తీసిన శివ సినిమాకి మాటలు రాసి రచయితగా మంచి గుర్తింపును సాధించారు.
![-Telugu Stop Exclusive Top Stories -Telugu Stop Exclusive Top Stories](https://telugustop.com/wp-content/uploads/2021/03/Tanikella-Bharani-Yamaleela-movie.jpg)
ఆయన నటుడిగా మారి యమలీల వంటి సినిమాతో మంచి గుర్తింపు సాధించారు అలాగే మనసంతా నువ్వే, నేనున్నాను, అతడు, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు, జులాయి, గబ్బర్ సింగ్, రాజా ది గ్రేట్ లాంటి సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ మంచి గుర్తింపును సాధించారు.దర్శకుడుగా కూడా మారి బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి గారిని పెట్టి మిథునం సినిమాని డైరెక్షన్ చేశారు.ఆ సినిమా మంచి విజయం సాధించింది.
మొన్నీ మధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తనికెళ్ల భరణి గారు రాళ్లపల్లి గారి గురించి చెప్తూ మొదట్లో తనికెళ్ల భరణి నాటకాలు వ్రాసినప్పుడు రాళ్లపల్లి గారి ఇంట్లో ఉంటూ తన కొడుకు లాగా ఆయనకు సేవ చేసుకున్నారని చెప్పుకొచ్చారు.అలాగే తనికెళ్ళ భరణి పుట్టినప్పటి నుండి శివ భక్తుడు అని కూడా చెప్పారు ఆయనలోని భక్తిని తెలియజేయడానికి ఆయన శివుడి మీద పాటలు కూడా రచించారు అందులో మంచి ఆదరణ పొందిన నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు అనే సాంగ్ ఒకటి.
![-Telugu Stop Exclusive Top Stories -Telugu Stop Exclusive Top Stories](https://telugustop.com/wp-content/uploads/2021/03/Tanikella-Bharani-Movie-offers-Career.jpg)
అలాగే ఆయన శివుడు మీద చాలా పాటలను రచిస్తూ తన భక్తిభావాన్ని చూపిస్తూ వస్తున్నాడు.స్వతహాగా తనికెళ్ళ భరణి బ్రాహ్మణ కులానికి సంబంధించిన వాడు కావడం వలన మొదటి నుంచే శివుడు మీద భక్తి భావం ఎక్కువగా ఉందని చెబుతూ ఉంటాడు.ప్రస్తుతం ఆయన భక్తకన్నప్ప అనే సినిమా స్టోరీని పూర్తి స్క్రిప్ట్ రాసుకుని సునీల్ తో చేయడానికి సిద్ధపడినప్పటికీ అది వర్కౌట్ కాలేదు.అయితే ఇంకో పక్క భక్తకన్నప్ప సినిమాని ప్రభాస్ తో చేయాలని కృష్ణంరాజు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు.
అయితే తనికెళ్ల భరణి రాసిన స్టోరీ తో ప్రభాస్ చేస్తాడా లేదా అనేది చూడాలి ఇదిలా ఉంటే తనికెళ్ల భరణి తో భక్తకన్నప్ప సినిమా చేయడానికి మోహన్ బాబు కొడుకు అయిన మంచు మనోజ్ ఎదురుచూస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.చూద్దాం మరి తనికెళ్ల భరణి భక్తకన్నప్ప సినిమా ఎవరితో చిత్రీకరిస్తాడో…
.