విక్కీ కౌశల్ ,రష్మిక మందన( Vicky Kaushal, Rashmika Mandana ) కలిసి నటించిన తాజా చిత్రం ఛావా.శంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా ఫిబ్రవరి 14న విడుదల అయ్యి హిట్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇందులో రష్మిక మందన హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.విడుదలైన మొదటి రోజే ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది.
అలాగే అన్ని ప్రాంతాల్లోనూ మంచి వసూళ్ళని రాబట్టింది.ప్రీ సేల్ బుకింగ్స్‌లోనే 5 లక్షల టికెట్స్‌తో హవా చూపిన ఈ హిస్టారికల్ ఫిల్మ్ తొలిరోజు రూ.31 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఈ ఏడాదిలో బాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది.

ఇటీవల విడుదలైన అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ ( Akshay Kumar Sky Force )తొలిరోజు రూ.15.30 కోట్లు వసూలు చేసి ఇప్పటివరకు మొదటి స్థానంలో ఉండగా తాజాగా ఛావా సినిమా ఆ రికార్డును బద్దలు కొడుతూ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది.విక్కీ కౌశల్ కెరీర్ లోనే ఈ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా ఛావా మూవీ నిలిచింది.
ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ని సాధించడంతోపాటు కలెక్షన్లు కురిపించడంతో సోషల్ మీడియా వేదికగా విమర్శకులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.అభిమానులు మూవీ మేకర్స్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ సినిమా మంచి కలెక్షన్ లు సాధించడంతో రష్మిక గోల్డెన్ లెగ్ ( Golden Leg )అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు.ఇటీవల కాలంలో రష్మిక ఏ సినిమాలో నటించిన ఆ సినిమా మంచి విజయం సాధిస్తున్న విషయం తెలిసిందే.దాంతో అభిమానులు గోల్డెన్ లెగ్ అంటూ ఈమెఫై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ సినిమా కంటే ముందు రష్మిక మందన అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా 18 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించి బాహుబలి లాంటి సినిమా రికార్డులను సైతం బద్దలు కొట్టింది.