సాధారణంగా కొందరి చేతులు నల్లగా, కాంతిహీనంగా మారిపోతుంటాయి.ముఖ్యంగా ఆడవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది.
చర్మం మొత్తం తెల్లగా ఉండి చేతులు మాత్రమే నల్లగా ఉంటే ఎంత బాధగా ఉంటుందో చెప్పక్కర్లేదు.అందుకే చేతులను తెల్లగా, అందంగా మెరిపించుకునేందుకు ఏవేవో క్రీములు, లోషన్లు వాడుతుంటారు.
అయితే న్యాచురల్‌గా కూడా చేతులను తెల్లగా, మృదువుగా మార్చుకోవచ్చు.ముఖ్యంగా అందుకు క్యాబేజీ గ్రేట్‌గా సహాయపడుతుంది.
మరి క్యాబేజీని చేతులకు ఎలా యూజ్ చేయాలి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా కొన్ని క్యాబేజీ ఆకులను తీసుకొని మిక్సర్ లో వేసి పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ క్యాబేజీ పేస్ట్‌లో కొద్దు ఉప్పు మరియు నిమ్మ రసం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసి మెల్ల మెల్లగా స్క్రబ్ చేసు కోవాలి.పావు గంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే క్రమంగా చేతులు తెల్లగా, కాంతివంతంగా మారతాయి.

అలాగే క్యాబేజీ ఆకులను మెత్తగా నూరి రసం తీసుకోవాలి.ఇప్పుడు ఈ రసంలో సోయా పిండి వేసి కలిపి చేతులకు అప్లై చేయాలి.ఇరవై, ముప్పై నిమిషాల పాటు డ్రై అవ్వనిచ్చ ఆ తర్వాత మెల్ల మెల్ల రుద్దుకుంటూ కూల్ వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.
ఇలా రెగ్యులర్‌గా చేసినా నల్లగా మారిన చేతులు తెల్లగా, కోమలంగా మారతాయి.
ఇక క్యాబేజీ ఆకులను రసం తీసుకుని అందులో చందనం పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు చేతులకు ఈ మిశ్రమాన్ని పట్టించి.అర గంట తర్వాత కొద్దిగా వాటర్ జల్లి స్క్రబ్ చేసుకుంటూ శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేసినా కూడా చేతులు మృదువుగా, తెల్లగా మారతాయి.