1.ఆర్వీఎం నమూనా వివరించిన ఈసీ
రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ పై ఎన్నికల సమావేశమైంది.ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు.ఆర్వీఎం నమూనాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రదర్శించింది.
2.కెసిఆర్ పై తుమ్మల కామెంట్స్
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తీర్చిదిద్దిన వ్యక్తి కెసిఆర్ అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు.
3.కేంద్రమంత్రి నితిన్ ఘట్కారికి బెదిరింపు
కేంద్రమంత్రి నితిన్ ఘట్కరి కార్యాలయానికి దావూద్ గ్యాంగ్ కు చెందిన వ్యక్తి బెదిరింపు ఫోన్ కాల్ చేశారు.కర్ణాటక రాష్ట్రంలోని బెలగావీ జైలులో కరాగార శిక్ష అనుభవిస్తున్న ఓ వ్యక్తి బెదిరింపు కాల్స్ చేశాడని పోలీసులు తెలిపారు.
4.నేడు హైదరాబాద్ కు టీమిండియా
న్యూజిలాండ్ ఇండియా మొదటి వన్డే క్రికెట్ మ్యాచ్ జరగనుంది.తొలి వన్డే మ్యాచ్ కు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికయ్యింది.
5.నేటి నుంచి మారుతి సుజుకి కార్ల ధర పెంపు
భారతదేశపు అగ్రశ్రేల తయారీ సంస్థ మారుతి సుజుకి ఈరోజు నుంచి తమ అన్ని మోడల్స్ కార్ల ధరలను సగటున 1.1 శాతం పెంచుతున్నట్లు తెలిపింది.
6.బిజెపి పడాధిధికారుల సమావేశం
ఢిల్లీ లోని బిజెపి కేంద్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం కొనసాగుతోంది.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
7.రాజమౌళి కి అవతార్ డైరెక్టర్ ప్రశంసలు
ఆర్ఆర్ సినిమా దర్శకుడు రాజమౌళి అవతార్ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ ప్రశంసలు కురిపించారు.ఈ విషయాన్ని తెలుపుతూ రాజమౌళి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
8.నేడు వైభవంగా జగ్గన్న తోట ప్రభల తీర్థం
కనుమ పండుగ సందర్భంగా నేడు జగ్గన్న తోట ప్రభల తీర్థం ను వైభవంగా నిర్వహించనున్నారు.అంబాజీపేట మండలం జగ్గన్న తోటకు ఊరేగింపుగా 11 గ్రామాల ప్రజలు రానున్నాయి.
9.తిరుమల సమాచారం
తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతోంది.నేడు తిరుమల శ్రీ వారిని దర్శించుకునేందుకు 18 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు.
10.మెడికల్ మాఫియాకు మావోయిస్ట్ ల లేఖ
భారత కమ్యూనిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరిట లేఖ ను విడుదల చేశారు.
11.నాగబాబుకు అంబటి రాంబాబు కౌంటర్
సంబరాల రాంబాబు గారు మీరు డాన్స్ మహత్తరంగా చేశారు.పోలవరం పూర్తిచేసి డాన్స్ చేసి ఉంటే ఇంకా మహత్తరంగా ఉండేది అంటూ నాగబాబు చేసిన కామెంట్స్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.తాను సంబరాల రాంబాబు నే అని, నువ్వు మీ తమ్ముడు అన్నట్టు సంబరాల రాంబాబునే కాని , ముఖానికి రంగు వేయను ప్యాకేజీ కోసం డాన్స్ చేయను అంటూ రాంబాబు కౌంటర్ ఇచ్చారు.
12.సైకో చంద్రబాబు అంటూ ఫ్లెక్సీ లు
సైకో చంద్రబాబు గో బ్యాక్.గో బ్యాక్ ., పుంగనూరు లో మత కలహాలు సృష్టిస్తున్న చంద్రబాబు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి.
13.జల్లికట్టులో 60 మందికి గాయాలు
తమిళనాడులో సంక్రాంతి సంబరాల్లో భాగంగా జల్లికట్టు జరుగుతోంది.ఎద్దులను లొంగదీసుకునే క్రమంలో దాదాపు 60 మంది వరకు గాయాల పాలైనట్లు నిర్వాహకులు తెలిపారు.
14.నేడు కరీంనగర్ కు కేసిఆర్
కరీంనగర్లో నేడు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య ఇటీవల మరణించారు.దీంతో కమలాకర్ ను కేసీఆర్ పరామర్శించనున్నారు.
15.రచయిత బాలమురుగన్ కన్నుమూత
సినీ పరిశ్రమలు విషాదం నెలకొంది.రచయిత బాలమురుగన్ కన్నుమూశారు.ఆయన తెలుగుతో పాటు తమిళంలో అనేక సినిమాలకు రచయితగా వ్యవహరించారు.
16.నేడు ఢిల్లీలో ప్రధాని రోడ్ షో
నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోది రోడ్ షో నిర్వహించారు.
17.శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ స్వామి అమ్మవారి బ్రహ్మోత్సవ కళ్యాణం వైభవంగా జరగనుంది.
18.రాష్ట్రస్థాయి ఎడ్ల పందాలు
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం గుండ్ల సముద్రంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు జరుగుతున్నాయి.
19.సిబిఐ పై మనీష్ ఆగ్రహం
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆదివారం తన కార్యాలయంపై సీబీఐ దాడి పై అధికారిక ప్రకటన విడుదల చేశారు.సిబిఐ నన్ను ఇరికించేందుకు ప్రయత్నిస్తుందని మనీష్ సిసోడియా ఆగ్రహం వ్యక్తం చేశారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 52,200 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 56,950
.