ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) మల్టీస్టారర్ సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో వెంకటేష్ మహేష్ బాబు ఇద్దరూ కలిసి మల్టీస్టారర్ సినిమా చేసిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా మల్టీ స్టారర్ సినిమాగా వచ్చి మంచి విజయాన్ని సాధించింది.హాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం గొప్ప గొప్ప దర్శకుల నుంచి ప్రశంసలను అందుకున్న ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి షేక్ చేసిందనే చెప్పాలి.
ఇక ఇండస్ట్రీలో ఇప్పుడు మరికొన్ని మల్టీస్టారర్ సినిమాలు( Multistarrer movies ) చేయడానికి కొంతమంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.ఇక అందులో భాగంగానే స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్ లందరూ ఇంట్రెస్ట్ చూపించడం విశేషం.

ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో( entire Indian film industry ) ఉన్న చాలా మంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన చర్చలైతే నడుస్తున్నాయి.మరి ఇప్పటివరకు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్న తెలుగు స్టార్ డైరెక్టర్లలో నాగ్ అశ్విన్ లాంటి దర్శకుడిగా ఒక మంచి గుర్తింపైతే ఏర్పాటు చేసుకున్నాడు.కల్కి సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన ఈ దర్శకుడు ఇప్పుడు మరోసారి కల్కి 2 సినిమాతో భారీ గుర్తింపును తెచ్చుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే ప్రి ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేసిన ఈయన ప్రభాస్ రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.మరి ఈ సినిమాతో కూడా భారీ విజయాన్ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…అయితే నాగ్ అశ్విన్ ఒక ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు గా తెలుస్తోంది.మరి ఆ స్టార్ హీరోలు ఎవరు అనేది ఇంకా తెలీదు కానీ ఆయన మాత్రం మల్టీ స్టారర్ మువు చేయడానికి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు…
.







