ఆరెంజ్ తొక్కలను పడేస్తున్నారా? ఇలా వాడితే చర్మాన్ని తెల్లగా మెరిపించుకోవచ్చు!

ఆరెంజ్.ప్రస్తుత చలికాలంలో విరివిరిగా లభ్యం అయ్యే పండ్లలో ఒకటి.

 How To Use Orange Peel For Skin Whitening! Orange Peel, Skin Whitening, Orange P-TeluguStop.com

పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఆరెంజ్ పండ్లు ఎంతో ఇష్టంగా తింటుంటారు.ఆరెంజ్ పండులో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.

అవి మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.అయితే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఆరెంజ్ పండు తొక్కలు పడేస్తుంటారు.

కానీ అవి కూడా మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.ముఖ్యంగా చర్మాన్ని తెల్లగా మెరిపించడానికి గ్రేట్ గా సహాయపడతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం స్కిన్ వైట్నింగ్ కోసం ఆరెంజ్ తొక్కల‌ను ఎలా వాడాలో తెలుసుకుందాం ప‌దండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో ఒక కప్పు ఆరెంజ్ తొక్కలను వేసి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఉడికించి చల్లారి పెట్టుకున్న ఆరెంజ్ తొక్కల‌ను వాటర్ తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని అన్ని క‌లిసేంత‌ వరకు బాగా మిక్స్ చేసుకుంటే ఆరెంజ్ పీల్ సీరం సిద్దమవుతుంది.

ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఈ సీరంను అప్లై చేసుకుని పడుకోవాలి.ప్రతిరోజు కనుక ఈ ఆరెంజ్ పీల్ సీరం ను వాడితే స్కిన్ వైట్ గా, బ్రైట్ గా మారుతుంది.ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి.చర్మం మృదువుగా మారుతుంది.మరియు మొటిమలు ఉన్నా సరే చాలా త్వరగా తగ్గుముఖం పడతాయి.

వాటి తాలూకు మచ్చలు సైతం మాయమవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube