ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను వాడితే పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే సూపర్ వైట్ గా మారవచ్చు!

చాలా మందికి త‌మ ముఖ చర్మాన్ని తెల్లగా మెరిపించుకోవాలనే కోరిక ఉంటుంది.ఈ క్రమంలోనే ఎక్కువ శాతం మంది వేలకు వేలు ఖర్చు పెట్టి మార్కెట్లో లభ్యమయ్యే స్కిన్ వైట్నింగ్ క్రీమ్ లను( Skin Whitening Cream ) కొనుగోలు చేసి వాడుతుంటారు.

 Homemade Cream For Getting White And Glowing Skin Details! Homemade Cream, Glowi-TeluguStop.com

వాటి వల్ల ఎంత వరకు ఫలితం ఉంటుందో పక్కన పెడితే.సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం చాలానే ఉంటాయి.

కానీ ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ క్రీమ్ ను కనుక వాడితే పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే సూపర్ వైట్ గా మారవచ్చు.పైగా ఈ క్రీమ్ వ‌ల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్‌ కూడా ఉండ‌వు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు,( Flax Seeds ) మూడు టేబుల్ స్పూన్లు బీట్ రూట్ తురుము,( Beet Root ) వ‌న్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ ఆకులు వేసి ప‌న్నెండు నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.జెల్లీ స్ట్రక్చర్ వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.

Telugu Beet Root, Flax Seeds, Skin, Green Tea, Homemade Cream, Skin Care, Skin C

ఈ మిశ్రమం కాస్త గోరు వెచ్చగా ఉన్నప్పుడే పల్చటి వస్త్రం సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జెల్ లో వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని ఐదు నిమిషాల పాటు స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేయాలి.తద్వారా మంచి క్రీమ్ సిద్ధమవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుని రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

Telugu Beet Root, Flax Seeds, Skin, Green Tea, Homemade Cream, Skin Care, Skin C

ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను రెగ్యులర్ గా కనుక వాడితే కొద్ది రోజుల్లోనే మీ చర్మం సూపర్ వైట్ గా, బ్రైట్ గా మారుతుంది.స్కిన్ టోన్ ను ఇంప్రూవ్ చేయడానికి ఈ న్యాచురల్ క్రీమ్ గ్రేట్ గా సహాయపడుతుంది.ఈ క్రీమ్ ను వాడటం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.

చర్మం యవ్వనంగా మెరుస్తుంది.స్కిన్ టైట్ గా గ్లోయింగ్ గా మారుతుంది.

కాబట్టి తప్పకుండా ఈ క్రీమ్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube