రుద్రాక్షల్లో ఎన్ని రకాలు ఉంటాయి. వాటి ప్రత్యేకత ఏమిటి?

రుద్రాక్షలు, రుద్రాక్ష మాలలు చాలా మంది ధరించడం. వాటి మాలలతో జపం చేయడం మనం చూస్తూనే ఉంటాం.

 How Many Types Rudrakshas And What Is The Use Of It, Rudrakshas, Lord Shiva, Dev-TeluguStop.com

 అయితే ఆ పరమేశ్వరుడి స్వరూపం అయిన రుద్రాక్షల్లో చాలా రకాలు ఉంటాయనే విషయం మనకు తెలుసు. కానీ అవి ఎన్ని రకాలు.

 ఎప్పుడెప్పుడు ఏ రుద్రాక్షలను ధరించాలి? వాటి వల్ల కలిగే లాభం ఏమిటో మాత్రం చాలా మందికి తెలియదు. అయితే మనం ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

హిందూ పురాణాల ప్రకారం మొత్తం మనకు 38 రకాల రుద్రాక్ష చెట్లు ఉన్నాయి. అయితే ఈ రుద్రాక్షలు శివుడి కన్నీటి నుంచి వచ్చినవని  చెబుతుంటారు.

 ఎడమ కన్ను నుంచి 12, కుడి కన్ను నుంచి 16, మూడో కన్ను నుంచి నల్లని రంగు 10 రుద్రాక్ష వృక్షాలు ఆవిర్భవించాయట. అయితే వీటిలో అనేక రకాల రుద్రాక్షలు ఉంటాయి ఏక ముఖ నుంచి 14 ముఖాల రుద్రాక్షల వరకు ఉంటాయి. అయితే 14 ముఖాలు ఉన్న రుద్రాక్షలు అంటే ఆ శివుడికి చాలా అష్టమట. అయితే ఏ రుద్రాక్ష ఏ దేవుడికి ధరించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఏక ముఖ రుద్రాక్ష – శివుడు, రెండు ముఖాలు – శివ కేశవులు ,మూడు ముఖాలు – అగ్ని రకం, నాలుగు ముఖాలు – బ్రహ్మ స్వరూలం, ఐదు ముఖాలు – కాలాగ్ని ఆరు ముఖాలు – షణ్ముఖ (సుబ్రహ్మణ్య స్వామి), ఏడు ముఖాలు – అనంగ (ఐశ్వర్యం), ఎనిమిది ముఖాలు – వినాయకుడు, తొమ్మిది ముఖాలు – భైరవుడు, పది ముఖాలు – జనార్దనుడు , పదకొండు ముఖాలు – రుద్రుడు , పన్నెండు ముఖాలు – ద్వాదశాదిత్యులు , పదమూడు ముఖాలు – కార్తికేయుడు, పద్నాలుగు ముఖాలు – ఇవి పరమేశ్వరుడికి ఇష్టమైన రుద్రాక్షలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube