రాత్రుళ్ళు జీన్స్ తో పడుకుంటున్నారా.. అయితే ఏరికోరి సమస్యలను తెచ్చుకుంటున్నట్లే!

ప్రస్తుత కాలంలో అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేకుండా అందరూ జీన్స్ ప్యాంట్స్ ను( Jeans Pants ) తెగ వాడేస్తున్నారు.నిత్యం జీన్స్ వేసుకునే వారు మనలో ఎంతో మంది ఉన్నారు.

 Side Effects Of Sleeping With Jeans Details, Side Effects Of Jeans, Sleeping Wi-TeluguStop.com

వినియోగానికి తగ్గట్లుగానే మార్కెట్లోకి రకరకాల జీన్స్ పాంట్స్ అందుబాటులోకి వస్తున్నాయి.ఎవరికి సూట్ అయ్యేవి వారు కొనుగోలు చేసి వాడుతున్నారు.

అయితే కొందరు తెలుసో తెలియకో రాత్రుళ్ళు కూడా జీన్స్ తోనే నిద్రిస్తూ ఉంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఏ కోరి సమస్యలను తెచ్చుకున్నట్లే అని నిపుణులు చెబుతున్నారు.రాత్రుళ్ళు జీన్స్ ప్యాంట్ వేసుకుని నిద్రించడం ఏమాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.

అసలు జీన్స్ ప్యాంట్ వేసుకొని పడుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

డెనిమ్‌ ఫ్యాబ్రిక్‌తో( Denim Fabric ) జీన్స్ ప్యాంట్స్ ను త‌యారు చేస్తాయి.స‌హ‌జంగానే వాటికి చెమ‌ట‌ను పీల్చుకునే స్వ‌భావం ఉండ‌దు.రాత్రుళ్ళు జీన్స్ తోనే ప‌డుకోవ‌డం వ‌ల్ల జననేంద్రియాల వద్ద చెమట అలాగే ఉండిపోతుంది.ఇది ఫంగల్ మరియు ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.

అలాగే డే అండ్ నైట్ స్కిన్ టైట్ జీన్స్ ను ధ‌రించి ఉండ‌టం వ‌ల్ల పురుషుల్లో పునరుత్పత్తి ఆరోగ్యం ప్రభావితం అవుతుంది.వదులుగా ఉండే దుస్తులు వేసుకునేవారితో పోలిస్తే.

జీన్స్ ఫ్యాంట్స్‌, బిగుతుగా ఉండే లోదుస్తులు వేసుకునే వారిలో వీర్య నాణ్యత( Sperm Quality ) బ‌ల‌హీనంగా ఉంద‌ని ఒక అధ్యయనంలో తేలింది.

Telugu Tips, Jeans, Jeans Effects, Latest, Effects Jeans, Skin Jeans-Telugu Heal

రోజంతా టైట్ జీన్స్ ధరించే పురుషులకు టెస్టిక్యులర్ క్యాన్సర్( Testicular Cancer ) వ‌చ్చే రిస్క్ కూడా పెరుగుతుంది.అలాగే జీన్స్‌ వంటి టైట్ దుస్తులు ధరించి రాత్రుళ్లు నిద్ర పోవడం వల్ల ఆడ‌వారిలో పొత్తి కడుపు, గర్భాశయం, జననేంద్రియాల‌పై తీవ్ర ఒత్తిడి ప‌డుతుంది.దీని కార‌ణంగా ఆయా భాగాలకు రక్తప్రసరణ స‌రిగ్గా జ‌ర‌గ‌దు.

ఫ‌లితంగా నెల‌స‌రి స‌మ‌యంలో నొప్పి తీవ్రంగా ఉంటుంది.నడుము నొప్పి, క‌డుపు నొప్పి వంటి త‌ర‌చూ వేధిస్తాయి.

Telugu Tips, Jeans, Jeans Effects, Latest, Effects Jeans, Skin Jeans-Telugu Heal

జీన్స్ ఫ్యాంట్ తో రోజంతా ఉండ‌టం వ‌ల్ల‌ మీ నడుము మరియు తుంటి మధ్య ఆరోగ్యకరమైన లయ దెబ్బతింటుంది.ఇది మీ భంగిమను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.ఇక రాత్రుళ్ళు జీన్స్ ధ‌రించ‌డం వ‌ల్ల నిద్ర కూడా స‌రిగ్గా ప‌ట్ట‌దు.సాధార‌ణంగా నిద్ర స‌మ‌యంలో శ‌రీర ఉష్టోగ్ర‌త త‌గ్గుతూ వ‌స్తుంది.అయితే జీన్స్ ధ‌రించ‌డం వ‌ల్ల నిద్రపోయినప్పుడు గాలి ప్రసరణ సరిగ్గా జ‌ర‌గదు.ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది.

ఫ‌లితంగా నిద్రకు అంతరాయం ఏర్పడుతుంది.కాబ‌ట్టి రాత్రుళ్ళు జీన్స్ తో ప‌డుకునే అల‌వాటు ఉంటే క‌చ్చితంగా వ‌దులుకోండి.

వ‌దులుగా ఉండే దుస్తుల‌ను ఎంచుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube