ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, కాలుష్యం, రెగ్యులర్ గా షాంపూ చేసుకోవడం తదితర కారణాల వల్ల చాలా మందిలో హెయిర్ గ్రోత్ అనేది ఆగిపోతుంది.దీని కారణంగా జుట్టు పల్చగా మారుతుంది.
ఈ సమస్యతో మీరు బాధపడుతున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్ మీకు బాగా సహాయపడుతుంది.ఈ ఆయిల్ ను వారానికి రెండు సార్లు వాడితే హెయిర్ గ్రోత్ ట్రిపుల్ అవుతుంది.అదే సమయంలో మరెన్నో బెనిఫిట్స్ సైతం లభిస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు, వన్ టేబుల్ స్పూన్ మెంతులు( Fenugreek ), వన్ టేబుల్ స్పూన్ ఆవాలు(Black mustard ), మూడు రెబ్బలు కరివేపాకు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఒక కప్పు కొబ్బరి నూనె( Coconut Oil ) వేసి బాగా కలిపి మూడు రోజుల పాటు ఎండలో ఉంచాలి.

ఆ తర్వాత ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ ను స్కాల్ప్ కు అప్లై చేసి కనీసం పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ అప్లై చేసుకున్న మరుసటి రోజు హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ గ్రోత్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.

అదే సమయంలో జుట్టు రాలడం తగ్గుతుంది.చుండ్రు సమస్య ( Dandruff ) ఉంటే దూరం అవుతుంది.జుట్టు త్వరగా తెల్లబడకుండా ఉంటుంది.
ఒకవేళ తెల్ల జుట్టు ఉంటే క్రమంగా నల్లబడుతుంది.అలాగే కురులు స్మూత్ గా మారతాయి.
మరియు చిట్లిన జుట్టు సైతం రిపేర్ అవుతుంది.కాబట్టి ఆరోగ్యమైన, ఒత్తైన జుట్టును పొందాలని కోరుకునే వారు తప్పకుండా ఈ మ్యాజికల్ ఆయిల్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.







