1.తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు

ఏపీ, తెలంగాణ లలో మరో రెండు రోజుల పాటు వడగాల్పులు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
2.జగన్ కు ధన్యవాదాలు
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించినందుకు ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఏపీ ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
3.జీవీఎల్ సవాల్

మోదీ పాలన పై విమర్శలు చేసే పార్టీలు బహిరంగ చర్చకు తమతో సిద్దమా అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సవాల్ చేశారు.
4.జనసేన వారాహి యాత్రకు అనుమతి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు ఎటువంటి ఇబ్బందులూ ఉండవు అని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
5.కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు

టిఆర్ఎస్ ప్రభుత్వం పై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి విమర్శలు చేశారు.రీజనల్ రింగ్ రోడ్డు కోసం , దళితులు , బలహీన వర్గాల వారి భూమిని సేకరిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదు అని వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
6.అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది.విచారణ ను 19 కి వాయిదా వేసింది.
7.హరీష్ రావు పర్యటన

నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు.
8.నేడు టీఎస్ ఈసెట్ ఫలితాలు
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో బీఈ , బీటెక్ , భిఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ఈసెట్ -2023 పరీక్ష ఫలితాలు నేడు విడుదల అయ్యాయి.
9.బండి సంజయ్ పై కవిత విమర్శలు

తెలంగాణ బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ పై బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సి కవిత విమర్శలు చేశారు.ఆడ బిడ్డ తలచుకుంటే అడ్రస్ గల్లంతు అవుతుందని సెటైర్ వేశారు.
10.రేపటి నుంచి పవన్ వారాహి యాత్ర
రేపటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది.
11.బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు

ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవాల్సిన అవసరం తమకు లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు.
12.తులసిరెడ్డి విమర్శలు
ఏపీలో కరెంట్ చార్జీలు పెంపు పై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శలు చేశారు.జగన్ రెడ్డి పాలనలో కరెంట్ బిల్లు ముట్టుకుంటే షాక్ కొడుతోంది అని తులసిరెడ్డి విమర్శించారు.
13.రాజమౌళి తో అమిత్ షా భేటీ

కేంద్ర హోం మంత్రి అమిత్ షా రేపు హైదరాబాద్ కి రానున్నారు.ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తో భేటీ కానున్నారు.
14.కేంద్రం పై కవిత విమర్శలు
కేంద్ర అధికార పార్టీ బీజేపీ పై ఎమ్మెల్సి కవిత విమర్శలు చేశారు.పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం లో గిరిజన మహిళా రాష్ట్రపతికి అన్యాయం జరిగిందని కవిత విమర్శలు చేశారు.
15.భారత్ లో భూకంపం

భారత్ లోని ఉత్తరాది ప్రాంతంలో భూకంపం సంభవించింది.రీక్టార్ స్కేల్ పై 5.7 గా నమోదు అయ్యింది.
16.బీఆర్ఎస్ కు కుచాడి రాజీనామా
నిర్మల్ జిల్లా బీ ఆర్ ఎస్ అధ్యక్షుడు కుచాడి శ్రీహరి రాజీనామా చేశారు.
17.శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి

కేంద్రమంత్రి పియూష్ గోయల్ సతి సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
18.అన్నవరంలో జనసేనాని
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు అన్నవరంలో తన ఎన్నికల ప్రచార రథం వారానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
19.మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ మృతి

మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 55,450 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 60,500
.