ఐఐటీలో సీటు సాధించిన గిరిజన బిడ్డ నవ్య.. ఈమె సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే!

జేఈఈ పరీక్ష రాసి ప్రతిష్టాత్మక ఐఐటీలలో చదవాలని భావించే విద్యార్థులు లక్షల సంఖ్యలో ఉంటారు.ఈ పరీక్ష కోసం చాలామంది కోచింగ్ తీసుకుంటారనే సంగతి తెలిసిందే.

 Banotu Navya Inspirational Success Story Details Here Goes Viral In Social Media-TeluguStop.com

అయితే బానోతు నవ్య( Banothu Navya ) ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివి ఐఐటీ సాధించడం ద్వారా వార్తల్లో నిలిచారు.నవ్య ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం గంగబండ తండాకు చెందిన విద్యార్థిని.

తల్లీదండ్రుల సంతానంలో నవ్య పెద్ద కూతురు.

Telugu Banothu Navya, Iit Bombay, Jee Exam, Khammam, Kusumanchi, Story-Inspirati

వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే గిరిజన కుటుంబంలో నవ్య జన్మించారు.నాలుగో తరగతి వరకు నవ్య మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదివారు.ఐదో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివిన నవ్య పదో తరగతిలో 9.5 జీపీఏ సాధించారు.ఆ తర్వాత పరిగిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చేరిన నవ్య ఇంటర్ ఎంపీసీ విభాగంలో చేరి 964 మార్కులు సాధించారు.

Telugu Banothu Navya, Iit Bombay, Jee Exam, Khammam, Kusumanchi, Story-Inspirati

కళాశాలలో జేఈఈకి ( JEE )సంబంధించిన శిక్షణ తీసుకున్న నవ్య ఒకవైపు చదువుకు మరోవైపు జేఈఈకి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు.ఇంటర్ పూర్తైన తర్వాత రోజుకు 16 గంటల పాటు ప్రిపరేషన్ సాగించిన నవ్య లెక్చరర్ల సహాయంతో మెలుకువలు నేర్చుకున్నారు.ఎస్టీ విభాగంలో ఆమెకు 1251వ ర్యాంక్ వచ్చింది.నవ్య ప్రతిభను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.హెడ్ మాస్టర్ సుమతి ప్రోత్సాహాన్ని అస్సలు మరిచిపోలేనని ఆమె చెప్పుకొచ్చారు.ఐఐటీ బాంబే( IIT Bombay)లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ సైన్స్ ఎంచుకున్నానని నవ్య పేర్కొన్నారు.

కుటుంబ సభ్యుల నమ్మకాన్ని నిలబెట్టడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె వెల్లడించారు.ఐఏఎస్ కావడం నా లక్ష్యమని నవ్య పేర్కొన్నారు.

బానోతు నవ్య ప్రతిభను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని ఆమె మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube