అజీర్తి మరియు గ్యాస్( Indigestion, gas ).మనల్ని అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే జీర్ణ సమస్యల్లో ఇవి ముందు వరుసలో ఉంటాయి.
మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడాన్ని అజీర్ణం లేదా అజీర్తి అంటారు.గ్యాస్ ట్రబుల్ లేదా కడుపు ఉబ్బరం అనేది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల వచ్చే సమస్య.
అజీర్తి, గ్యాస్ వంటివి ఎప్పుడో ఒకసారి ఇబ్బంది పెడితే పెద్ద సమస్య ఏమి ఉండదు.కానీ వీటితో కొందరు ప్రతినిత్యం బాధపడుతుంటారు.
వీటి కారణంగా ఏదైనా తినాలంటేనే జంకుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కా మీకు చాలా బాగా సహాయపడుతుంది.
భోజనం అనంతరం పెరుగులో రెండు పదార్థాలు కలిపి తీసుకుంటే గ్యాస్ అజీర్తి వంటి జీర్ణ సమస్యలు మీ వంక కూడా చూడవు.
మరి ఇంకెందుకు ఆలస్యం పెరుగులో( yogurt ) కలిపి తీసుకోవాల్సిన ఆ రెండు పదార్థాలు ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక చిన్న కీర దోసకాయను( Green cucumber ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే కొన్ని కొత్తిమీర ఆకులను కూడా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.

ఆ తర్వాత ఒక చిన్న కప్పు పెరుగు తీసుకుని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు కీర దోసకాయ తురుము లేదా ముక్కలు వేసుకోవాలి.మరియు రెండు స్పూన్లు కొత్తిమీర( Coriander ) తరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.భోజనం తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి.
కీరా దోసకాయ కడుపుకు మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది.అదే సమయంలో కడుపులోని ఆమ్లాన్ని తటస్తం చేయడానికి తోడ్పడుతుంది.
పైగా కీర దోసకాయలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.ప్రేగు కదలికలను సక్రమంగా ఉంచుతుంది.

అలాగే కడుపులోని యాసిడ్ స్థాయిని అదుపులో ఉంచే సామర్థ్యం పెరుగుకు కూడా ఉంది.మరియు పెరుగు అజీర్ణానికి సరైన చికిత్సగా చెప్పబడింది.ఇక కొత్తిమీర జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.కొత్తిమీరలో ఉండే ఫైబర్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.గ్యాస్, అజీర్తి వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.కాబట్టి భోజనం తర్వాత పెరుగులో కీర దోసకాయ, కొత్తిమీర కలిపి తీసుకుంటే గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి జీర్ణ సంబంధిత సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.